News March 11, 2025
గోవాడను గట్టెక్కించే వారే లేరా..?

జిల్లాలో గోవాడ షుగర్ ఫ్యాక్టరీ హాట్ టాపిక్‌గా మారింది. ప్రత్యక్షంగా 24 వేలమంది రైతులు, 800 మందికార్మికులు ఆధారపడిన ఈ ఫ్యాక్టరీ నష్టాల్లో నడుస్తోంది. నష్టాల నుంచి ఫ్యాక్టరీని గట్టెక్కిస్తామంటూ నాయకులు హామీలిచ్చి గెలిచిన తర్వాత గాలికొదిలేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఏ ప్రభుత్వమోచ్చినా సమస్య తీరడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టాల్లో ఉన్న గోవాడను ఇప్పటికైనా గట్టెక్కించాలని కోరుతున్నారు.
Similar News
News March 22, 2026
రేషన్‌కార్డుదారులకు రేపటి నుంచి కిరోసిన్

AP: గ్యాస్ కొరత నేపథ్యంలో గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం రేపటి నుంచి లీటర్ చొప్పున కిరోసిన్ పంపిణీ చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రానికి 2,800 కిలో లీటర్ల(ఒక కిలో లీటర్= వెయ్యి లీటర్లు) కిరోసిన్‌ను అందించిన విషయం తెలిసిందే. APని కిరోసిన్ రహిత రాష్ట్రంగా మార్చినప్పటికీ సంక్షోభ పరిస్థితుల కారణంగా మళ్లీ సరఫరా చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
News March 22, 2026
మదనపల్లెలో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

మదనపల్లెలో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం మదనపల్లె నూతన జిల్లా పోలీసు కార్యాలయంలోనే నిర్వహిస్తామని, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదివారం తెలిపారు. ఫిర్యాదుదారులు నేరుగా విన్నవించుకునేందుకు వీలుగా, ఆధునిక వసతులతో కూడిన నూతన కార్యాలయంలోనే ఇకపై ప్రతి సోమవారం ఫిర్యాదుల స్వీకరణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ స్వయంగా మాట్లాడతారని తెలిపారు.
News March 22, 2026
HYD: ‘లే అమ్మా..’ రాత్రంతా తల్లి శవం వద్ద కూతురు

నగర శివారు షాద్‌నగర్‌లోని రంగారెడ్డిగూడకి చెందిన శోభ దారుణ హత్యకు గురైన విషయం <<19447260>>తెలిసిందే<<>>. ఉదయం పొలాల్లో పసిపాప ఏడుపు వినిపించడంతో గమనించిన రైతు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి నుంచి కూతురు తల్లి మృతదేహం వద్దనే ‘లే.. అమ్మా’ అంటూ రోదిస్తున్న దృశ్యం అందరిని కలిచివేసింది.


