News March 11, 2025
NGKL: వట్టెం వెంకన్న స్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం

నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రసిద్ధ వట్టెం వెంకన్న స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు భక్తుల సందడిలో వైభవంగా నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Similar News
News November 6, 2025
ONGCలో 2,623 అప్రెంటీస్‌లు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్(ONGC)లో 2,623 అప్రెంటీస్ ఖాళీలకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ పాసై, 18-24 ఏళ్లు ఉన్నవారు అర్హులు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అభ్యర్థులను విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://ongcindia.com/
News November 6, 2025
విశాఖ: డీసీసీబీలో అవినీతి ఆరోపణలు

విశాఖ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన పదోన్నతుల వ్యవహారం బ్యాంకులో కలకలం సృష్టిస్తోంది. పదోన్నతుల విషయంలో రూ.కోటి వరకు మామూళ్లు వసూలు చేశారన్న గుసగుసలు వినిపించాయి. బ్యాంకులో అవినీతి అక్రమాలపై అప్కాబ్‌కు ఫిర్యాదులు అందాయి. అన్ని విధాలుగా అర్హతలు ఉన్న వారిని పక్కన పెట్టి అర్హత లేని వారికి పదోన్నతలు ఇచ్చారన్న విమర్శలు వచ్చాయి.
News November 6, 2025
కైకలూరు ఇటు.. నూజివీడు అటు.. మరి పెనమలూరు?

జిల్లాల మార్పుపై మంత్రివర్గ ఉపసంఘం నుంచి స్పష్టత రానుంది. ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లాలోకి, కైకలూరు నియోజకవర్గం కృష్ణా జిల్లాలోకి రానున్నాయి. కాగా, ఎన్టీఆర్ జిల్లాకు దగ్గరగా ఉన్నప్పటికీ పెనమలూరును కృష్ణా జిల్లాలోనే ఉంచుతారనే చర్చ రావడంతో స్థానికులు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి.


