News March 11, 2025
సంగారెడ్డి: ఇంటర్ ఫస్టియర్ 96.81% హాజరు

సంగారెడ్డి జిల్లాలో 54 పరీక్ష కేంద్రాల్లో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో 96.81% విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవింద్ రాం తెలిపారు. 20,555 మంది విద్యార్థులకు గాను 19,900మంది విద్యార్థులు హాజరయ్యారని, 655మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
Similar News
News March 7, 2026
సివిల్స్ ర్యాంకర్ రామును అభినందించిన అచ్చెన్న

జి. సిగడాం మండలం నడిమివలస గ్రామానికి చెందిన సౌరోతు రాము సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 463వ ర్యాంకు సాధించడం పట్ల వ్యవసాయ శాఖమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభినందించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన రాము కష్టపడి చదివి ఈరోజు సివిల్స్‌లో మంచి ర్యాంక్ సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కృషి ఉంటే ఎలాంటి పరిస్థితులులోనైనా ఉన్నత స్థాయిలో రాణించవచ్చన్నారు.
News March 7, 2026
ప.గో: చంద్రబాబు తప్పిదంతోనే డయాఫ్రం వాల్‌కు నష్టం.. వైసీపీ ట్వీట్

పోలవరం స్పిల్‌వే, కాఫర్ డ్యాంలు పూర్తిచేయకుండానే డయాఫ్రం వాల్ పనులు ప్రారంభించడం వల్లే నష్టం వాటిల్లిందని కాగ్ నివేదిక స్పష్టం చేసిందని, చంద్రబాబు తప్పిదం వల్లే ఇలా జరిగిందని ‘ఎక్స్’ వేదికగా వైసీపీ ట్వీట్ చేసింది. 2022లో అసెంబ్లీలో వైఎస్ జగన్ ఇదే విషయాన్ని చెప్పారని, అప్పట్లో టీడీపీ నేతలు ఈ వాస్తవాన్ని అంగీకరించలేదని ఆ పార్టీ తాజా ట్వీట్‌లో గుర్తు చేసింది.
News March 7, 2026
పెద్దపల్లి: గ్రామ పంచాయతీలకు ₹21.04 కోట్ల నిధులు

PDPL జిల్లాలోని 13 మండలాల పరిధిలోని జీపీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు ₹21.04 కోట్లు విడుదలైనట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. 2023-25 ఆర్థిక సంవత్సరాలకు గాను 3 విడతల్లో ఈ నిధులను కేటాయించామన్నారు. ఇందులో అన్‌టైడ్ గ్రాంట్ కింద ₹5.73 కోట్లు, టైడ్ గ్రాంట్ కింద ₹15.31 కోట్లు విడుదలయ్యాయని వివరించారు. ఈ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.


