News March 23, 2024

మంచి ఉద్దేశంతోనే ఎలక్టోరల్ బాండ్లు ప్రవేశపెట్టాం: గడ్కరీ

image

దేశంలో సంచలనంగా మారిన ఎలక్టోరల్ బాండ్లపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ‘ఆర్థిక వనరులు లేకుండా ఏ పార్టీ మనుగడ సాధించలేదు. కొన్ని దేశాల్లో పార్టీలకు ప్రభుత్వమే నిధులు ఇస్తుంది. అలాంటి వ్యవస్థ మన దగ్గర లేనందున మంచి ఉద్దేశంతోనే ఎన్నికల బాండ్ల పథకాన్ని తీసుకొచ్చాం. అధికారంలో ఉన్న పార్టీ మారితే సమస్యలు తలెత్తకూడదనే దాతల పేర్లు బయటపెట్టలేదు’ అని తెలిపారు.

Similar News

News November 2, 2024

అన్నీ బాగున్నాయ్.. మీకేది నచ్చింది?

image

దీపావళి సందర్భంగా ప్రేక్షకులను అలరింపజేసేందుకు ఏకంగా నాలుగు కొత్త సినిమాలు రిలీజయ్యాయి. తెలుగు హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘క’, మలయాళ నటుడు దుల్కర్ నటించిన ‘లక్కీ భాస్కర్’, తమిళ నటుడు శివ కార్తికేయన్ నటించిన ‘అమరన్’ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ప్రముఖ కన్నడ హీరో శ్రీమురళి నటించిన ‘బఘీరా’ కూడా యావరేజ్‌గా నిలిచింది. ఇవన్నీ దీపావళి విజేతలుగా నిలిచాయి. మరి మీకు నచ్చిన సినిమా ఏంటో కామెంట్ చేయండి.

News November 2, 2024

ముగిసిన రెండో రోజు ఆట.. పట్టు బిగించిన భారత్

image

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ పట్టుబిగించింది. కివీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే పరిమితం చేసింది. ఇవాళ ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 171/9 రన్స్ చేసింది. ఓవరాల్‌గా 143 పరుగుల లీడ్‌లో ఉంది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా స్పిన్ మాయాజాలం ధాటికి కివీస్ బ్యాటర్లు పరుగులు రాబట్టలేకపోయారు. విల్ యంగ్ (51) ఒక్కరే అర్ధ సెంచరీ సాధించారు. జడేజా 4, అశ్విన్ 3 వికెట్లు తీశారు.

News November 2, 2024

మిరాకిల్ బేబీల గురించి తెలుసా?

image

గర్భిణి ప్రసవానికి ముందు మరణించినప్పటికీ కొన్నిసార్లు బిడ్డ బతుకుతుంటుంది. దీనిని Coffin birth లేదా Posthumous birth అంటారు. గర్భిణి మరణించడంతో గర్భాశయ ముఖద్వారం వ్యాకోచించదు. ఈ నేపథ్యంలో పోస్ట్‌మార్టం ద్వారా పిండాన్ని బయటకు తీస్తారు. ఇలాంటి వారిని ‘మిరాకిల్ బేబీ’గా పిలుస్తారు. అయితే, ఇది అన్ని రకాల మరణాల్లో సాధ్యం కాదని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచంలో ఏటా 3లక్షల మంది ప్రసవ సమయంలో చనిపోతున్నారు.