News March 11, 2025

NZB: పోలీస్ స్టేషన్‌లో వ్యక్తికి సంకెళ్లు

image

పోలీస్ స్టేషన్‌లో ఓ వ్యక్తితో వెట్టి చాకిరి చేయించిన ఘటన బోధన్‌లో జరిగింది. ఓ కేసులో అరెస్టు చేసిన వ్యక్తి కాళ్లకు సంకెళ్లు వేసి ఆ వ్యక్తితో పోలీస్ స్టేషన్‌ను ఊడిపించారు. కానిస్టేబుల్ గంగాధర్ ముందే పోలీస్ స్టేషన్‌లో చీపురుతో క్లీన్ చేస్తున్న చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Similar News

News January 9, 2026

బాస్కెట్ బాల్ స్టేట్ కమిటీలో నిజామాబాద్ జిల్లా వాసి

image

తెలంగాణ రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా జిల్లాకి చెందిన బొబ్బిలి నరేశ్ నియామకం అయ్యారు. నిజామాబాద్ జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న బొబ్బిలి నరేశ్ కుమార్‌కు ఈ అవకాశం రావడంతో జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందనలు తెలిపారు.

News January 9, 2026

టీయూ పరిధిలో పీజీ పరీక్షలు వాయిదా

image

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఈ నెల 16 నుంచి జరగాల్సిన పీజీ ఎమ్మెస్సీ/ఎంఏ/ఎంకాం/ఎమ్మెస్ డబ్ల్యూ/ఎంబీఏ/ఎంసీఏ/ఐఎంబీఏ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. పూర్తి వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

News January 9, 2026

NZB: కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసిన ఎంపీ అరవింద్

image

నిజామాబాద్ కలెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇలా త్రిపాఠిని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్‌లో జరిగిన ఈ భేటీలో జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ పనులపై వారు చర్చించారు. నూతన కలెక్టర్‌కు ఎంపీ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవడానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు.