News March 11, 2025
ఏలూరు: అత్యాచారం చేసిన ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

ఏలూరు జిల్లా కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. ఆసుపత్రి డాక్టర్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు నిర్వహించారు. మృత శిశువు కైకలూరు మండలానికి చెందిన మైనర్ బాలికకు జన్మించినట్లు గుర్తించారు. మైనర్ బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారని చెప్పారు. అత్యాచారానికి పాల్పడిన కోనాల గణేశ్, ప్రత్తిపాటి వినీత్‌లను అరెస్టు చేశామన్నారు.
Similar News
News March 21, 2026
లింకేజీ రుణాల్లో జనగామ వెనుకంజ..!

స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ప్రతి ఏటా వారి సంక్షేమానికి రూ.కోట్లు వెచ్చిస్తోంది. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో లింకేజీ రుణాల లక్ష్యం రూ.460 కోట్లు కేటాయించగా.. ఇప్పటి వరకు రూ.353 కోట్లు మాత్రమే లింకేజీ రుణాలు అందించడం జరిగింది. దీంతో రుణాల మంజూరులో జిల్లా వెనుకబడింది.
News March 21, 2026
USకు ఇరాన్ పంచ్.. 4000km దూరంలోని బేస్‌పైకి మిస్సైళ్లు

యుద్ధంలో ఇరాన్ దాడులు US, ఇజ్రాయెల్‌తో పాటు ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా ఇండియానా ఓషన్‌లో ఉన్న US-UK మిలిటరీ బేస్ డియాగో గార్షియాపై 2 బాలిస్టిక్ మిస్సైళ్లు సంధించింది. ఇది ఇరాన్‌కు ఏకంగా 4000km దూరంలో ఉండటం గమనార్హం. టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఒక మిస్సైల్ గాల్లోనే పేలిపోయిందని US తెలిపింది. మరొకదాన్ని తమ SM-3 ఇంటర్‌సెప్టర్ అడ్డుకుందని పేర్కొంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
News March 21, 2026
వెంకట్రావుపేటలో ఉరివేసుకొని వ్యక్తి మృతి

మల్లాపూర్ మండలం వెంకట్రావుపేటలో శనివారం ఉరివేసుకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం వెంకట్రావుపేటలోని పెద్దమ్మ తండాకి చెందిన జరుఫుల రమేశ్ అనే వ్యక్తి గ్రామ శివారులోని మామిడి తోటలో ఉరివేసుకొని మృతి చెందాడు. కుటుంబ కలహాలు ఆర్థిక సమస్యలే ఆయన మృతికి కారణమని భావిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


