News March 23, 2024

ఐసిస్-K: రష్యాను ఎందుకు టార్గెట్ చేసింది?

image

రష్యా రాజధాని మాస్కోలో <<12908235>>కాల్పుల<<>> ఘటనకు కారణం తామేనని ఐసిస్-K ప్రకటించుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ఆయన విధానాలను ఈ గ్రూప్ ఎప్పటి నుంచో తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ముస్లింలను అణిచివేసే కార్యకలాపాల్లో రష్యా భాగస్వామిగా ఉందని విశ్వసిస్తోంది. అందుకే రష్యాను టార్గెట్ చేసి ఎటాక్ చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ గ్రూప్ గతంలో అఫ్గానిస్థాన్, ఇరాన్, కాబుల్ ఎయిర్‌పోర్టులలో భయంకర దాడులు జరిపింది.

Similar News

News November 2, 2024

BREAKING: రెండో దశ మెట్రోకు గ్రీన్ సిగ్నల్

image

TG: హైదరాబాద్‌లో రెండో దశ మెట్రో నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు జీవో 196 జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. 76.4 కి.మీ మేర రూ.24,269 కోట్ల వ్యయంతో దీనిని చేపడుతున్నారు. ఇందులో రాష్ట్ర వాటా, రూ.7,313 కోట్లు, కేంద్రం వాటా రూ.4,230 కోట్లు, జికా, ఏడీబీ, ఎన్డీబీ వాటా రూ.11,693 కోట్లుగా ఉంది. త్వరలోనే పనులు ప్రారంభిస్తారు.

News November 2, 2024

ప్ర‌సిద్ధ శైవ క్షేత్రాల‌కు స్పెష‌ల్ బ‌స్సుల‌ు: TGSRTC

image

కార్తీక మాసంలో ప్ర‌సిద్ధ శైవ క్షేత్రాల‌కు HYD నుంచి స్పెష‌ల్ బ‌స్సుల‌ను న‌డుపుతున్నామ‌ని TGSRTC MD సజ్జనార్ తెలిపారు. ఈ నెల 15న అరుణాచ‌లానికి ప్ర‌త్యేక ప్యాకేజీని అందిస్తున్నామ‌ని, APలోని పంచారామాల‌కు ప్ర‌తి సోమ‌వారం ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. http://tgsrtcbus.inలో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చన్నారు. వివ‌రాల‌కు 040-69440000, 040-23450033 నంబర్లలో సంప్ర‌దించాల‌న్నారు.

News November 2, 2024

సంతానం విషయంలో చంద్రబాబు కరెక్ట్: అసదుద్దీన్

image

TG: ఎక్కువ మంది సంతానం ఉండాలని AP, TN CMలు చంద్రబాబు, స్టాలిన్ అంటున్నారని, కానీ అదే విషయాన్ని తానంటే రాద్ధాంతం చేసేవారని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ‘దక్షిణాదిలో జననాల రేటు తక్కువగా ఉందని చంద్రబాబు గుర్తించారు. ఒక వేళ జనాభా ప్రకారం నియోజకవర్గాల డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదికి ఎంతో నష్టం కలుగుతుంది. అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల సంఖ్య తగ్గి దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది’ అని ఆయన పేర్కొన్నారు.