News March 11, 2025

ఆమిర్ ఖాన్, రణ్‌బీర్ కపూర్ మల్టీస్టారర్?

image

ఆమిర్ ఖాన్, రణ్‌బీర్ కపూర్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వనున్నారు. నటి అలియా భట్ ఈ విషయాన్ని తన ఇన్‌స్టాలో ప్రకటించారు. ‘బ్యాటిల్ ఆఫ్ ది బెస్ట్. నాకు అత్యంత ఇష్టమైన ఇద్దరు నటులు పోటీ పడనున్నారు. చాలా ఉత్సుకతగా ఉంది. మరిన్ని వివరాలు రేపు చెప్తా. నాకెంత నచ్చిందో మీకూ అంత నచ్చుతుంది. నాకు తెలుసు’ అని పోస్ట్ చేశారు. దీంతో ఇది మల్టీస్టారరా లేక ఏదైనా ప్రకటనా అంటూ సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు.

Similar News

News March 12, 2025

ఝట్కా, హలాల్‌ మటన్‌కు తేడా ఏంటి?

image

మహారాష్ట్రలో మల్హర్ సర్టిఫికేషన్ నేపథ్యంలో ఝట్కా, హలాల్ విధానాలపై SMలో చర్చ జరుగుతోంది. మొఘలులకు పూర్వం దేశంలో ఝట్కా విధానమే పాటించేవారు. జీవికి సునాయాస మరణం ప్రసాదించడమే దీని ప్రధాన ఉద్దేశం. అంటే ఒక్క వేటుతో మెడను వేరు చేస్తారు. దీనివల్ల చెడు హార్మోన్లు ఉత్పత్తి అవ్వవని, మాంసం ఫ్రెష్‌గా ఉంటుందని చెప్తారు. అలాగే మనిషి లాలాజలంతో కలుషితం అవ్వదంటారు. హలాల్‌ ప్రక్రియ ఇందుకు భిన్నంగా ఉంటుంది.

News March 12, 2025

జోరుగా ‘హలాల్ మటన్’ వ్యతిరేక ఉద్యమం!

image

మహారాష్ట్రలో హలాల్ వ్యతిరేక ఉద్యమం ఊపందుకుంది. మంత్రి నితేశ్ రాణె స్వయంగా దీనికి నాయకత్వం వహిస్తుండటం, NDA నేతలు మద్దతిస్తుండటం గమనార్హం. హలాల్‌కు ప్రత్యామ్నాయంగా మల్హర్ సర్టిఫికేషన్‌ను తీసుకొచ్చారు. హిందూ పద్ధతుల్లో మేకలు, గొర్రెలు, కోళ్లను కోసే ఝట్కా పద్ధతిని ప్రమోట్ చేస్తున్నారు. సర్టిఫికేషన్ ద్వారా ఈ మాంసం షాపులను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తున్నారు. కాంగ్రెస్, MVA దీనిని వ్యతిరేకిస్తున్నాయి.

News March 12, 2025

RECORD: కోహ్లీని దాటేసిన హార్దిక్ పాండ్య

image

భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ రికార్డును దాటేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత కప్‌తో దిగిన ఫొటోను పాండ్య పోస్ట్ చేయగా 6 నిమిషాల్లోనే మిలియన్ లైక్స్ సాధించింది. గతంలో కోహ్లీ పెట్టిన ఓ పోస్టుకు 7నిమిషాల్లో మిలియన్ లైకులు రాగా, తాజాగా హార్దిక్ ఫొటో దాన్ని దాటేసింది. CT గెలిచిన తర్వాత కప్‌ను పిచ్‌పై ఉంచి కాబీ‌లేమ్ స్టైల్లో దిగిన ఫొటో వైరల్ అయిన విషయం తెలిసిందే.

error: Content is protected !!