News March 23, 2024
HYD: ప్రేమ పెళ్లి.. ఒకరోజు ముందు లవర్ దుర్మరణం

పెళ్లికి ఒకరోజు ముందు ప్రియుడు మృతి చెందాడు. HYDలో ఉంటున్న శంకర్, నిజామాబాద్‌కు చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఈనెల 20న పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. ఊరెళ్లేందుకు 19న సిటీలో అమ్మాయిని బస్సెక్కించి.. తాను బైక్‌పై బయల్దేరాడు. కందుకూరులో కారు ఢీకొని శంకర్ గాయపడగా.. అదే రూట్‌లో వస్తున్న ప్రియురాలు గమనించి బస్ దిగేసింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శంకర్ చనిపోవడం బాధాకరం.
Similar News
News March 11, 2026
రూ.126 కోట్ల ‘గ్రీన్’ టెండర్లు.. పచ్చదనం ముసుగులో నిధుల దోపిడీయేనా?

HMDA గ్రీన్ ప్లాన్‌లో మతలబు ఏంటి? పదేళ్ల పాటు మొక్కల సంరక్షణ పేరుతో రూ. 126 కోట్లు ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఉన్న ప్లాంటేషన్ పరిస్థితి దారుణంగా ఉంటే, కొత్తగా ఇన్ని కోట్లు కుమ్మరించడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. చట్టబద్ధంగా టెండర్లు పిలిచామని అధికారులు చెబుతున్నా, కాంట్రాక్టుల కేటాయింపులో పారదర్శకత ప్రశ్నార్థకంగా మారింది.
News March 11, 2026
HYD: తక్షణమే సిలిండర్ డెలివరీ.. CP వార్నింగ్

వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న ఆందోళనను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని CP సజ్జనార్ తెలిపారు. తక్షణమే సిలిండర్ డెలివరీ, అదనపు సిలిండర్లు ఇస్తామంటూ SMలో నకిలీ ప్రకటనలు ఇస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. వాట్సాప్, ఎస్ఎంఎస్‌ల ద్వారా ఫేక్ వెబ్‌సైట్ లింకులను పంపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదని CP హెచ్చరించారు.
SHARE IT
News March 11, 2026
డ్రగ్స్ నెట్‌వర్క్‌కు ‘ఈగిల్’ షాక్.. ఏఐతో నేరగాళ్ల గుట్టు రట్టు!

ఇక డ్రగ్స్ మాఫియా ఆటలు సాగవు..! గంజాయి, డ్రగ్స్ దందా చేసే కేటుగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేందుకు తెలంగాణ ‘ఈగిల్ ఫోర్స్’ సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది. నేరగాళ్ల ఫోన్లు, కంప్యూటర్లలోని డేటాను సెకన్లలో చిదిమేసేందుకు అత్యాధునిక ‘ఏఐ డిజిటల్ ఫోరెన్సిక్’ సిస్టమ్‌ను తీసుకొస్తోంది. వాట్సాప్ చాట్లు, సోషల్ మీడియా గుట్టును విప్పడమే కాకుండా.. AIతో అనుమానిత సంభాషణలను ఇట్టే పట్టేస్తుంది.


