News March 11, 2025

నిషేధిత జాబితాలోకి ‘హయగ్రీవ’ భూములు

image

AP: విశాఖపట్నం ఎండాడలోని ‘హయగ్రీవ’ భూములను రాష్ట్ర సర్కార్ నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ జరగకుండా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ చర్యలు తీసుకున్నారు. కాగా వైసీపీ హయాంలో హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ సంస్థకు 12.51 ఎకరాలు కేటాయించింది. నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడిందంటూ కూటమి సర్కార్ ఆ భూములను వెనక్కి తీసుకుంది. ఇప్పుడు వీటిని నిషేధిత జాబితాలో చేర్చింది.

Similar News

News March 12, 2025

కొడాలి నానికి ఊరట

image

AP: మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానికి హైకోర్టులో ఊరట దక్కింది. విశాఖలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని ఆయన ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయగా నేడు విచారణ జరిగింది. ఈ క్రమంలో కొడాలి నానిపై ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టం చేసింది. 35(3) కింద ఆయనకు నోటీసులు ఇచ్చి వివరాలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.

News March 12, 2025

ఝట్కా, హలాల్‌ మటన్‌కు తేడా ఏంటి?

image

మహారాష్ట్రలో మల్హర్ సర్టిఫికేషన్ నేపథ్యంలో ఝట్కా, హలాల్ విధానాలపై SMలో చర్చ జరుగుతోంది. మొఘలులకు పూర్వం దేశంలో ఝట్కా విధానమే పాటించేవారు. జీవికి సునాయాస మరణం ప్రసాదించడమే దీని ప్రధాన ఉద్దేశం. అంటే ఒక్క వేటుతో మెడను వేరు చేస్తారు. దీనివల్ల చెడు హార్మోన్లు ఉత్పత్తి అవ్వవని, మాంసం ఫ్రెష్‌గా ఉంటుందని చెప్తారు. అలాగే మనిషి లాలాజలంతో కలుషితం అవ్వదంటారు. హలాల్‌ ప్రక్రియ ఇందుకు భిన్నంగా ఉంటుంది.

News March 12, 2025

జోరుగా ‘హలాల్ మటన్’ వ్యతిరేక ఉద్యమం!

image

మహారాష్ట్రలో హలాల్ వ్యతిరేక ఉద్యమం ఊపందుకుంది. మంత్రి నితేశ్ రాణె స్వయంగా దీనికి నాయకత్వం వహిస్తుండటం, NDA నేతలు మద్దతిస్తుండటం గమనార్హం. హలాల్‌కు ప్రత్యామ్నాయంగా మల్హర్ సర్టిఫికేషన్‌ను తీసుకొచ్చారు. హిందూ పద్ధతుల్లో మేకలు, గొర్రెలు, కోళ్లను కోసే ఝట్కా పద్ధతిని ప్రమోట్ చేస్తున్నారు. సర్టిఫికేషన్ ద్వారా ఈ మాంసం షాపులను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తున్నారు. కాంగ్రెస్, MVA దీనిని వ్యతిరేకిస్తున్నాయి.

error: Content is protected !!