News March 11, 2025

బయ్యారంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత

image

బయ్యారంలో గంజాయి తరలిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూట్ కేసులో తరలిస్తున్న ఈ గంజాయిని పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి తరలిస్తుండగా పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న వ్యక్తులు, వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 20, 2026

ఉద్యోగులకు డిజిటల్ హెల్త్ కార్డులు

image

TG: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని(EHS) ప్రారంభిస్తున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో భట్టి విక్రమార్క ప్రకటించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు 421 ఎంప్యానెల్ ప్రైవేటు హాస్పిటల్స్‌లో 1,998 వ్యాధులకు చికిత్స పొందవచ్చని తెలిపారు. ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డు అందిస్తామన్నారు.

News March 20, 2026

నల్గొండ: ఇరుకైన బ్రిడ్జిలు.. ఘోర ప్రమాదాలు

image

కోదాడ-జడ్చర్ల, నల్గొండ-మాచర్ల హైవేలపై ఇరుకైన వంతెనలు, రక్షణ గోడలు లేకపోవడంతో ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. గత నెల హాలియా సమీపంలో జరిగిన లారీ ప్రమాదంలో కొత్తగూడెం దంపతులు మృతి చెందగా, కంపాసాగర్ వద్ద కారు కాల్వలో పడి మరో దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస ఘటనలు ప్రయాణికులను వణికిస్తున్నాయి. అధికారులు స్పందించి వంతెనలకు రక్షణ గోడలు నిర్మించి, ప్రమాదాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

News March 20, 2026

ఒక్క రోజే రూ.5,000 తగ్గిన వెండి ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఓ వైపు <<19430821>>బంగారం<<>> ధరలు పెరగ్గా వెండి ధరలు తగ్గాయి. కేజీ సిల్వర్‌పై రూ.5వేలు తగ్గి రూ.2,60,000 పలుకుతోంది. నిన్న కూడా కేజీపై రూ.10,000 తగ్గిన విషయం తెలిసిందే. మొత్తంగా 3 రోజుల్లో కేజీపై రూ.20,000 తగ్గడం గమనార్హం.