News March 11, 2025
పాకిస్థాన్‌లో రైలు హైజాక్.. బందీలుగా 450మంది!

పాకిస్థాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను బలోచ్ లిబరేషన్ ఆర్మీ(BLA) హైజాక్ చేసింది. అందులోని ఆరుగురు సైనికుల్ని చంపింది. 350మందికి పైగా ప్రయాణికుల్ని, 100మంది సైనికుల్ని బందీలుగా తీసుకుంది. ‘మా పోరాటవీరులు రైల్వే పట్టాల్ని పేల్చేసి రైలును హైజాక్ చేశారు. మాపై ఏమైనా సైనిక చర్యలకు ఉపక్రమిస్తే అదే స్థాయిలో ప్రతిస్పందన ఉంటుంది, అందర్నీ చంపేస్తాం’ అని హెచ్చరించింది. తమ డిమాండ్లు ఏంటన్నది ఇంకా చెప్పలేదు.
Similar News
News January 30, 2026
రాష్ట్రానికి రూ.128.43 కోట్ల NHM నిధులు

AP: జాతీయ ఆరోగ్య మిషన్ చివరి విడత కింద ఆయా జిల్లాలకు ప్రభుత్వం రూ.128.43 కోట్లను విడుదల చేసింది. FEB 20లోగా వీటిని ఖర్చు చేయాలని ఆదేశించింది. జిల్లాల వారీగా గుంటూరుకు రూ.20.61 కోట్లు, నెల్లూరుకు రూ.8.60 కోట్లు, కృష్ణాకు రూ.6.21 కోట్లు ఇచ్చారు. మిగిలిన జిల్లాలకు రూ.5.20 కోట్ల నుంచి రూ.2 కోట్ల చొప్పున విడుదల చేసినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు.
News January 30, 2026
కళ్లు మూసి తెరిచేలోపే SMలో ఇంత జరుగుతుందా?

సోషల్ మీడియాలో ఒక్క సెకనులో ఏం జరుగుతుందో గూగుల్ GEMINI ఆసక్తికర డేటాను వెల్లడించింది. దీని ప్రకారం సెకనుకు వాట్సాప్‌లో 10 లక్షల మెసేజ్‌లు, ఇన్‌స్టాలో 1,000 ఫొటోలు అప్‌లోడ్ అవుతున్నాయి. ‘X’లో 10 వేల ట్వీట్స్ చేస్తుంటే గూగుల్‌లో లక్షకు పైగా సెర్చ్‌లు జరుగుతున్నాయి. ఇక యూట్యూబ్‌లో 90 వేల వీడియోలు చూస్తున్నారు. మనం కనురెప్ప వేసి తెరిచేలోపు డిజిటల్ ప్రపంచం ఇంతలా కదులుతోందన్నమాట.
News January 30, 2026
చర్చలకు మాస్కో రండి.. జెలెన్‌స్కీకి రష్యా ఆహ్వానం

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని శాంతి చర్చలకు మాస్కో రావాలని రష్యా ఆహ్వానించింది. అయితే ఈ విషయంపై ఆయన నుంచి ఇంకా స్పందన రాలేదని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. గతేడాది రష్యా పంపిన ఆహ్వానాన్ని జెలెన్‌స్కీ తిరస్కరించారు. తన దేశంపై మిసైళ్లు ప్రయోగిస్తున్న దేశానికి తాను వెళ్లబోనని స్పష్టం చేశారు.


