News March 11, 2025
ఏలూరు: టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థులకు గుడ్‌న్యూస్

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు జిల్లా ప్రజా రవాణా అధికారి వరప్రసాద్ గుడ్ న్యూస్ చెప్పారు. టెన్త్ పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోల పరిధిలో ఈనెల 17 నుంచి వచ్చే నెల 1 వరకు విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ప్రయాణించవచ్చని, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో అనుమతిస్తారన్నారు.
Similar News
News March 18, 2026
BHPL: డిప్యూటీ తహశీల్దార్‌లకు పదోన్నతులు

రెవెన్యూ శాఖలో పదోన్నతులు కల్పిస్తూ సీసీఎల్ఏ అధికారి లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా జిల్లాకు నలుగురు తహశీల్దార్లు నియమితులయ్యారు. ములుగు నుంచి రాపల్లి రాజేశ్వరరావు, కరీంనగర్ నుంచి టి.వసంత్ రావు, టి.స్వరూప రాణి, వరంగల్ నుంచి అడ్లూరి రాజేశ్వర్ రావులకు భూపాలపల్లి జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. త్వరలోనే వీరు విధుల్లో చేరనున్నారు.
News March 18, 2026
జనం సెక్సువల్ కంటెంట్ చూస్తున్నారు: రక్షిత

‘KD: ది డెవిల్’ సినిమాలోని ‘సర్కే చునర్’ పాట అసభ్యంగా ఉందన్న <<19406830>>విమర్శల<<>>పై డైరెక్టర్ ప్రేమ్ భార్య, మాజీ నటి రక్షిత స్పందించారు. గతంలో వచ్చిన ఈ తరహా పాటలకులేని అభ్యంతరం ఇప్పుడెందుకని ప్రశ్నించారు. ప్రస్తుతం జనం రక్తపాతం, సెక్సువల్ కంటెంట్‌ను చూస్తున్నారని, కేవలం ఒక్క పాటతో తన భర్తను వ్యక్తిగతంగా దూషించడం సరికాదని మండిపడ్డారు. కన్నడ సినిమాలను థియేటర్లకు చేర్చడం ఎంత కష్టమో అర్థం చేసుకోవాలని కోరారు.
News March 18, 2026
జమ్మికుంట: రేపు మార్కెట్‌కు సెలవు

ఉగాది పండుగను పురస్కరించుకుని రేపు జమ్మికుంట మార్కెట్‌కు సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ పుల్లూరి స్వప్న తెలిపారు. ప్రభుత్వ సెలవు కారణంగా గురువారం మార్కెట్ కార్యకలాపాలు నిలిపివేయబడతాయని, తిరిగి శుక్రవారం నుంచి యథావిధిగా మార్కెట్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కావున రైతులు, వ్యాపారస్తులు, కార్మికులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా ఆమె కోరారు.


