News March 11, 2025
LENOVO నుంచి ఫ్లిప్ ల్యాప్‌టాప్!

ప్రస్తుతం కొన్ని కంపెనీలు ఫ్లిప్ ఫోన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఫ్లిప్ ల్యాప్‌టాప్‌ను తాజాగా లెనోవో కంపెనీ లాంచ్ చేసింది. సాధారణంగా ఇది 13.9 ఇంచుల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. వివిధ అవసరాల కోసం ఫ్లిప్ ఓపెన్ చేస్తే 18.1 ఇంచుల డిస్‌ప్లేగా మారుతుంది. ఇది OLED, 120HZ టచ్ స్క్రీన్‌తో ఉంటుంది. అలాగే 16.9MM మందంతో 1.4 కిలోల బరువు ఉంటుంది. దీని ధరను కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు.
Similar News
News March 14, 2026
పెట్రోల్, డీజిల్‌ను నిల్వ చేస్తున్నారా?

యుద్ధం కారణంగా ఇంధనం కొరత రావొచ్చనే భయంతో చాలా మంది పెట్రోల్, డీజిల్‌ను విడిగా తీసుకెళ్లి నిల్వ చేసుకుంటున్నారు. అయితే దేశంలో సరిపడా నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని కేంద్రం ప్రకటించింది. నిల్వల వల్ల అగ్ని ప్రమాదాలు జరగొచ్చని హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించే పెట్రోల్ బంకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. వాహనాల్లో మాత్రమే ఇంధనం నింపుకోవాలని సూచించింది.

రోహిత్‌కు హార్దిక్ వార్నింగ్?.. MI రియాక్షన్ ఇదే

ఈ ఏడాది IPL ప్రారంభానికి ముందు రోహిత్ శర్మకు MI కెప్టెన్ హార్దిక్ వార్నింగ్ ఇచ్చినట్లుగా ఓ స్పోర్ట్స్ అకౌంట్ ట్వీట్ చేసింది. హిట్ మ్యాన్ ప్రదర్శన సరిగా లేకపోతే సహించేది లేదని పాండ్య మేనేజ్‌మెంట్‌కు చెప్పినట్లు పేర్కొంది. దీనిపై MI స్పందించింది. ‘ఏమైనా రాసుకోవచ్చు’ అనే అర్థంలో నవ్వుతున్న ఎమోజీని పోస్టు చేసింది. ఇలాంటి రూమర్స్‌ను పుట్టించడం సాధారణమై పోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.