News March 11, 2025
విదేశాలకు వెళ్లే వారి కోసమే హెల్ప్ డెస్క్ ఏర్పాటు: కలెక్టర్

ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వలస వెళ్లే తమ కుటుంబాలను పోషించుకోవలసిన వారికి అన్ని విధాలా సౌకర్యవంతమైన సేవలందించేందుకు అమలాపురం కలెక్టరేట్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసామని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. మంగళవారం అమలాపురం కలెక్టరేట్లో విదేశీ వ్యవహారాల హెల్ప్ డెస్క్‌ను కలెక్టర్ జిల్లా ఎస్పీ కృష్ణారావు, జేసీ ప్రశాంతి, వీఆర్వో రాజకుమారి, ఆర్డీవోలు మాధవి, శ్రీకర్, అఖిలతో కలిసి ప్రారంభించారు.
Similar News
News November 5, 2025
ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు త్వరగా పరిష్కరిస్తాం: కలెక్టర్

కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, మెడికల్ కాలేజీ సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. బుధవారం సాయంత్రం మెడికల్ కాలేజీ సమావేశ మందిరంలో అన్ని వైద్య విభాగాల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. వైద్య పరికరాలు, సిబ్బంది నియామకాలు, వసతుల మెరుగుదల కోసం చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి టీజీ భరత్ సహకారంతో సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు.
News November 5, 2025
కోర్టుకు పాస్‌పోర్ట్ అప్పగించిన రాజంపేట MP

ఐక్యరాజ్య సమితి సదస్సులో పాల్గొనడానికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఇటీవల అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటన ముగియడంతో ఆయన ఇండియాకు వచ్చారు. మద్యం కేసులో ఆయనకు కండిషనల్ బెయిల్ వచ్చింది. పాస్‌పోర్ట్‌ను కోర్టులో సమర్పించాలని అప్పట్లోనే ఆదేశించింది. అమెరికా వెళ్లే ముందు ఆయన పాస్‌పోర్టు తీసుకోగా.. ఇవాళ కోర్టులో తిరిగి సమర్పించారు.
News November 5, 2025
ఆరిలోవలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

సింహాచలం బీఆర్‌టీఎస్ రోడ్డులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సింహాచలం నుంచి బైక్ పై ఆరిలోవ వైపు వస్తున్న ఇద్దరు యువకులు రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బైకు పై ఉన్న ఇద్దరు యువకులు గాయపడడంతో ఆసుపత్రికి తరలించినట్లు ఆరిలోవ పోలీసులు తెలిపారు. మృతుడు గురుద్వార్‌కి చెందిన సూర్యనారాయణగా గుర్తించారు.


