News March 11, 2025
నితిన్ గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి భేటీ

మంత్రి KVR ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారుల అభివృద్ధి, విస్తరణ, ఇతర మౌలిక సదుపాయాలపై ఆయనతో సమగ్ర చర్చలు జరిపారు. టెన్నాలీ-HYD ఎక్స్‌ప్రెస్ హైవే, WGL – KMM జాతీయ రహదారి విస్తరణ, HYD రింగ్ రోడ్డు విస్తరణ అంశాలపై KVR గడ్కరీతో ప్రస్తావించారు. TGలో పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారి ప్రాజెక్టులకు నిధులివ్వాలని కోరారు.
Similar News
News January 15, 2026
ఈ నెలాఖరు నుంచి కాగ్నిజెంట్ కార్యకలాపాలు ప్రారంభం

ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ తన కార్యకలాపాలను ఈ నెలాఖరు నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధం అవుతుంది. అయితే కాగ్నిజెంట్ వివిధ క్యాంపస్‌లలో పని చేస్తున్న దాదాపు 900 మందిని విశాఖకు బదిలీ చేశారు. మధురవాడ ఐటీ హిల్స్ సమీపంలో సొంత క్యాంపస్ కోసం 22 ఎకరాలు కేటాయించగా సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మహతి బ్లాక్‌లో కార్యకలపాలు సాగిస్తోంది.
News January 15, 2026
తలసానిపై కేసు.. వివాదం ఏంటి?

TG: BRS సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై SR నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఆయన సికింద్రాబాద్‌లో జరిగిన ఓ ప్రోగ్రాంలో ‘సికింద్రాబాద్‌ను ముక్కలు చేయాలని చూస్తే నిన్ను ముక్కలు చేస్తాం’ అని CM రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. హైదరాబాద్ డివిజన్ల పునర్విభజన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత రవి కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా FIR ఫైల్ చేశారు.
News January 15, 2026
MHBD: మున్సిపాలిటీల రిజర్వేషన్ వివరాలు ఇవే!

జిల్లాలో 4 మున్సిపాలిటీల రిజర్వేషన్ వివరాలు అధికారులు ప్రకటించారు. MHBD మున్సిపాలిటీలో ఎస్టీ 7,ఎస్సీ 5, జనరల్ మహిళ 10, జనరల్ 8, బీసీ 6 (మొత్తం 36), డోర్నకల్ ఎస్టీ 3, ఎస్సీ 4, జనరల్ మహిళ 4, జనరల్ 4 (మొత్తం15), మరిపెడ ఎస్టీ 6, ఎస్సీ 1, జనరల్ మహిళ 4, జనరల్ 4 (మొత్తం 15), తొర్రూరు ఎస్టీ 2, ఎస్సీ 3, జనరల్ మహిళ 5, జనరల్ 3, బీసీ 3 (16) కాగా, కేసముద్రం రిజర్వేషన్ రావాల్సి ఉంది.


