News March 11, 2025
ప్రత్తిపాడు: రాజేష్ మహాసేనను పరామర్శించిన లోకేష్

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజేష్ మహాసేన తండ్రి సరిపెళ్ల సాధు సుందరసింగ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మరణించారు. ఈ విషయం మంత్రి నారా లోకేష్‌కు తెలియడంతో మహాసేన రాజేష్‌ను ఫోన్‌లో పరామర్శించి, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపన తెలియజేసి ధైర్యంగా ఉండాలని సూచించారు.
Similar News
News November 9, 2025
మహిళా జర్నలిస్టులపై ఆన్‌లైన్ హింస సరికాదు: జస్టిస్ సూర్యకాంత్

సోషల్ మీడియా లేదా ఆన్‌లైన్ వేదికగా మహిళా జర్నలిస్టులపై జరుగుతున్న హింసను కాబోయే సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఖండించారు. వారి ప్రతిష్ఠకు హాని కలగకుండా నిర్ధిష్టమైన సెక్యూరిటీ ప్రొటోకాల్ అనుసరించాలని కోరారు. ఢిల్లీలో జరిగిన ఇండియన్ ఉమెన్స్ ప్రెస్ కార్ప్స్ 31వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సాంకేతికతను వాడుకొని వారి ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ, వారిని ట్రోలింగ్ సరైన చర్య కాదని పేర్కొన్నారు.
News November 9, 2025
KNR: కాంగ్రెస్‌లో అయెమయం.. నేతల మధ్య విబేధాలు

కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో అయోమయం మొదలైంది. నాయకుల మధ్య విభేదాలు, అగ్రశ్రేణి న్యాయకత్వం వద్ద సమన్వయం లేకపోవడంతో ఇటీవల కరీంనగర్లో జరిగిన అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో ఓటమిపాలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరాల కోసం పార్టీలో చేరిన నాయకులు ఆధిపత్యాన్ని చూపిస్తున్నారు. దీంతో పార్టీని పట్టుకుని ఉన్న పాత కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
News November 9, 2025
బై పోల్.. ప్రచారానికి నేడే ఆఖరు

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచార పర్వం నేటితో ముగియనుంది. సాయంత్రం 6 గంటలకు మైకులు, ప్రచార రథాలు మూగబోనున్నాయి. ప్రచార గడువు ముగియనుండటంతో ఆయా పార్టీల నేతలు తమ ప్రత్యర్థులపై పదునైన మాటల తూటాలు సంధిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు ఇవాళ సా.6 నుంచి ఈ నెల 11(పోలింగ్ తేదీ) సా.6 గంటల వరకు నియోజకవర్గంలో వైన్స్ మూసివేయాలని HYD సీపీ సజ్జనార్ ఆదేశించారు.


