News March 23, 2024
ఈ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే: సత్యకుమార్ యాదవ్
AP: అధికారులు మోసం చేశారంటూ కుటుంబం <<12908035>>ఆత్మహత్య<<>> చేసుకున్న ఘటనపై BJP జాతీయ నేత సత్యకుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘సొంత జిల్లాలో ఇలాంటి దారుణాలు జరుగుతున్నా CMకు చీమ కుట్టినట్లు కూడా లేదు. ఈ ఆత్మహత్యలన్నీ YCP ప్రభుత్వ హత్యలే. ప్రజల నుంచి దోచుకున్న ఆస్తులను చట్టబద్ధం చేసుకునేందుకే భూ యాజమాన్య చట్టం తెచ్చారు. అధికారంలోకి రాగానే ప్రతి పైసా కక్కిస్తాం’ అని ట్వీట్ చేశారు.
Similar News
News November 2, 2024
ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు స్పెషల్ బస్సులు: TGSRTC
కార్తీక మాసంలో ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు HYD నుంచి స్పెషల్ బస్సులను నడుపుతున్నామని TGSRTC MD సజ్జనార్ తెలిపారు. ఈ నెల 15న అరుణాచలానికి ప్రత్యేక ప్యాకేజీని అందిస్తున్నామని, APలోని పంచారామాలకు ప్రతి సోమవారం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు పేర్కొన్నారు. http://tgsrtcbus.inలో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చన్నారు. వివరాలకు 040-69440000, 040-23450033 నంబర్లలో సంప్రదించాలన్నారు.
News November 2, 2024
సంతానం విషయంలో చంద్రబాబు కరెక్ట్: అసదుద్దీన్
TG: ఎక్కువ మంది సంతానం ఉండాలని AP, TN CMలు చంద్రబాబు, స్టాలిన్ అంటున్నారని, కానీ అదే విషయాన్ని తానంటే రాద్ధాంతం చేసేవారని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ‘దక్షిణాదిలో జననాల రేటు తక్కువగా ఉందని చంద్రబాబు గుర్తించారు. ఒక వేళ జనాభా ప్రకారం నియోజకవర్గాల డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదికి ఎంతో నష్టం కలుగుతుంది. అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల సంఖ్య తగ్గి దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది’ అని ఆయన పేర్కొన్నారు.
News November 2, 2024
అన్నీ బాగున్నాయ్.. మీకేది నచ్చింది?
దీపావళి సందర్భంగా ప్రేక్షకులను అలరింపజేసేందుకు ఏకంగా నాలుగు కొత్త సినిమాలు రిలీజయ్యాయి. తెలుగు హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘క’, మలయాళ నటుడు దుల్కర్ నటించిన ‘లక్కీ భాస్కర్’, తమిళ నటుడు శివ కార్తికేయన్ నటించిన ‘అమరన్’ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ప్రముఖ కన్నడ హీరో శ్రీమురళి నటించిన ‘బఘీరా’ కూడా యావరేజ్‌గా నిలిచింది. ఇవన్నీ దీపావళి విజేతలుగా నిలిచాయి. మరి మీకు నచ్చిన సినిమా ఏంటో కామెంట్ చేయండి.