News March 11, 2025

ములుగు: గిరిజన యూనివర్సిటీ వీసీ నియామకం

image

ములుగు జిల్లా సమక్క- సారక్క గిరిజన యూనివర్సిటీకి మొదటి వైస్ ఛాన్సలర్‌ను భారత ప్రభుత్వం/ కేంద్ర విద్యా శాఖ నియమించింది. హైదరాబాదులోని ఆరోరా హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అకాడమీకి చెందిన ప్రొఫెసర్ యెడవల్లి లక్ష్మీ శ్రీనివాస్‌ను నియమించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.

Similar News

News March 15, 2026

ఎగుమతులు బంద్.. పడిపోతున్న బియ్యం ధరలు

image

TG: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత్ నుంచి బియ్యం ఎగుమతులు నిలిచిపోవడంతో రాష్ట్రంపై ప్రభావం పడుతోంది. క్రమంగా ధరలు పడిపోతున్నాయి. ఈ నెల 8న దొడ్డు ధాన్యం ధర క్వింటా ₹2,550 ఉండగా ప్రస్తుతం ₹2,450కి తగ్గింది. మరో ₹150 వరకు తగ్గే ఛాన్స్ ఉందని మిల్లర్లు చెబుతున్నారు. ఈ సీజన్‌లో మరో 145L టన్నుల బియ్యం మార్కెట్లోకి రానుందని, ఎక్స్‌పోర్ట్ ఆగిపోయినందున కొనేందుకు వ్యాపారులు ఆసక్తి చూపరని పేర్కొంటున్నారు.

News March 15, 2026

NLG: నిమ్మకు రికార్డు ధర.. దిగుబడి లేకపాయె

image

వేసవి తాకిడికి నిమ్మకాయలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. తెలంగాణలోనే ఏకైక నిమ్మ మార్కెట్ అయిన NKLలో ప్రస్తుతం నిమ్మ బస్తా (23 కిలోల టిక్కి) రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు పలుకుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు 30 వేల ఎకరాల్లో నిమ్మ సాగవుతోంది. తెగుళ్ల కారణంగా నిమ్మ దిగుబడి గణనీయంగా తగ్గింది. మార్కెట్‌లో రేటు ఉన్నా, చేతిలో సరకు లేక పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News March 15, 2026

అనంతలో ఆశాజనకంగా చీనీ ధరలు

image

చీనీ ధరలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ.. తగ్గుముఖం పడుతున్న టమాటా ధరలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం మార్కెట్ యార్డులో చీనీ కాయలు టన్ను గరిష్ఠ ధర రూ.23 వేలు, కనిష్ఠ ధర రూ.8 వేలు పలికింది. అనంతపురం నగరానికి సమీపాన ఉన్న కక్కలపల్లి మార్కెట్లో కిలో టమాటా గరిష్ఠంగా రూ.7, కనిష్ఠంగా రూ.4 చొప్పున క్రయవిక్రయాలు జరిగాయి.