News March 11, 2025
ములుగు: గిరిజన యూనివర్సిటీ వీసీ నియామకం

ములుగు జిల్లా సమక్క-సారక్క గిరిజన యూనివర్సిటీకి మొదటి వైస్ ఛాన్సలర్‌ను భారత ప్రభుత్వం/ కేంద్ర విద్యా శాఖ నియమించింది. హైదరాబాదులోని ఆరోరా హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అకాడమీకి చెందిన ప్రొఫెసర్ యెడవల్లి లక్ష్మీ శ్రీనివాస్‌ను నియమించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
Similar News
News October 24, 2025
విద్యార్థిని ఆత్మహత్య.. విచారణకు ఆదేశించిన పొన్నం

భీమదేవరపల్లి మండలం వంగరలోని పీవీ గురుకుల పాఠశాలలో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హుజురాబాద్ మండలం రాంపూర్‌కి చెందిన విద్యార్థిని ఘటనపై హనుమకొండ కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పూర్తి స్థాయి విచారణ జరపాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
News October 24, 2025
MNCL: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల

2026 మార్చిలో జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదలైంది. అన్ని సబ్జెక్టులకు రూ.125, 3 సబ్జెక్టులకు రూ.110, 3 కన్న ఎక్కువ సబ్జెక్టులకు రూ.125, వోకేషనల్ కు అదనంగా రూ.185 చెల్లించాలని మంచిర్యాల డీఈఓ యాదయ్య తెలిపారు. అపరాధ రుసుం లేకుండా ఈ నెల 30 నుంచి నవంబర్ 13 వరకు, అపరాధ రుసుంతో రూ.50తో 29 వరకు, రూ.200తో డిసెంబర్ 11 వరకు, రూ.500తో డిసెంబర్ 29 వరకు ఫీజు చెల్లించాలని సూచించారు.