News March 11, 2025

పార్వతీపురం: జిల్లా ప్రయాణికుల లోగో ఆవిష్కరణ

image

జిల్లా ప్రయాణికుల లోగోను జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ మంగళవారం ఆవిష్కరించారు. జిల్లా ప్రయాణికుల సంక్షేమ సంఘం ఈ లోగోను రూపొందించింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బడే నాగభూషణ రావు, తోటపల్లి టెంపుల్ ట్రస్ట్ ట్రెజరర్ శ్రీరామచంద్ర మూర్తి, డిఆర్‌యూసీసీ సభ్యులు శ్రీహరి, ఏఐ సాఫ్ట్ బ్రాండ్ ప్రతినిధి డా.మని భూషణ్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 29, 2025

అల్లూరి: పశువుల శాల కాదు.. పాఠశాలే

image

అల్లూరి జిల్లా పెదబయలు మండలంలో అనేక పాఠశాలలకు పక్కా భవనాలు లేక విద్యార్థుల తీవ్ర అవస్థలు పడుతున్నారు. జంగంపుట్టు గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో సుమారు 40 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి పక్కా పాఠశాల భవనం లేక ఇబ్బందులు తప్పడం లేదు. రేకుల షెడ్డులోనే తరగతి నిర్వహణ జరుగుతుండడంతో వారు చలికి వణుకుతూ.. ఎండకి ఎండుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

News December 29, 2025

అమరావతిలో హైస్పీడ్, ట్రాఫిక్‌ ఫ్రీ రోడ్లు

image

AP: రాజధాని అమరావతిలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. ట్రాఫిక్ జామ్‌కు తావులేకుండా విశాలమైన రహదారుల నిర్మాణం ఊపందుకుంది. 50-60 మీటర్ల వెడల్పుతో హైస్పీడ్ రోడ్లను నిర్మిస్తున్నారు. E11, E13, E15 రహదారులను NH-16తో అనుసంధానం చేస్తున్నారు. 9 వరుసల సీడ్ యాక్సెస్ రోడ్డు(E-3) ద్వారా అమరావతికి సులభంగా చేరుకోవచ్చు. రోడ్ల కింద డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ లైన్లు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.

News December 29, 2025

రికార్డు సృష్టించిన కోనేరు హంపి

image

ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత స్టార్, ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో కలిపి మొత్తం 5 వరల్డ్ ర్యాపిడ్‌ ఛాంపియన్‌షిప్‌ మెడల్స్ గెలిచిన మొదటి మహిళగా హంపి రికార్డు సృష్టించారు. 15 ఏళ్ల వయసులోనే చదరంగంలో గ్రాండ్ మాస్టర్ అయిన హంపి.. గత రెండు దశాబ్దాల్లో ఎన్నో ఘనతలు సాధించారు.