News March 11, 2025
పార్వతీపురం: అప్పారావు కుటుంబ ఆచూకీ లభ్యం

కొనేరు అప్పారావు కుటుంబ ఆచూకీ లభ్యమైందని జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం అప్పారావు కుటుంబ సభ్యులు కలెక్టర్‌ను కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన అప్పారావు అనే వ్యక్తి 20 ఏళ్ల నుంచి కుటుంబానికి దూరంగా ఉంటూ, తమిళనాడుకి చెందిన అన్నాదురై దగ్గర గొర్రెల కాపరిగా పనిచేస్తున్నట్లు ఇటీవల అధికారులు గుర్తించారన్నారు.
Similar News
News April 16, 2026
NZB: ఆ రోజు BIG DAY.. రేవంత్ రెడ్డి Vs కేసీఆర్..!

APR 20న జరిగే భారీ బహిరంగ సభలు TGలో పొలిటికల్ హీట్‌ను పెంచనున్నాయి. BRS జగిత్యాల జైత్రయాత్ర సభలో KCR ప్రసంగించనున్నారు. అదే రోజు CM రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించి, సభలో మాట్లాడనున్నారు. అవుట్‌డేటెడ్ నేత జీవన్ రెడ్డి కోసం BRS సభ పెట్టుకుందని కాంగ్రెస్ నేతలు అంటుండగా.. ఇన్ని రోజులు పట్టించుకోని రేవంత్ రెడ్డి KCRకు భయపడి ఇప్పుడు మేడిగడ్డను చూసేందుకు వస్తున్నారని BRS నేతలు అంటున్నారు.
News April 16, 2026
ఖమ్మంలో 18న జాబ్ మేళా.. డిగ్రీ అర్హతతో 20 ఉద్యోగాలు

ఖమ్మం జిల్లా నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనకు ఈనెల 18న టేకులపల్లి ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి మాధవి తెలిపారు. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో 20 ఖాళీల భర్తీకి డిగ్రీ అర్హత గల 20-40 ఏళ్ల వారు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు వేతనం ఉంటుంది. ఆసక్తి గల వారు సర్టిఫికెట్లతో శనివారం ఉదయం 10 గంటలకు హాజరుకావాలని కోరారు.
News April 16, 2026
కరోండా జీవకంచెతో అనేక లాభాలున్నాయ్

కరోండా ముళ్లతో నిండి ఉండటం వల్ల పశువులు, మేకలు, అడవి పందులు, కుందేళ్లు ఈ కంచెను దాటలేవు. ఈ మొక్క వేర్లు మట్టిని బలంగా పట్టుకుంటాయి. ఫలితంగా ఇవి నేల కోతను, మృత్తికా క్రమక్షయాన్ని తగ్గిస్తాయి. పంటకు అవసరమైన తేమను నిల్వ ఉంచుతాయి. ఈ పొదల్లో పక్షులు గూళ్లు కట్టుకొని రకరకాల పురుగులను తిని పంటకు మేలు చేస్తాయి. తేనెటీగలు ఈ పూలపై తిరుగుతాయి. వీటి వల్ల పొలాల్లో పరాగసంపర్కం జరిగి పంట దిగుబడి పెరుగుతుంది.


