News March 11, 2025
చౌటుప్పల్‌లో తాగు నీటి సరఫరాపై కలెక్టర్ సమీక్షా

వేసవికాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పటిష్ఠమైన నివారణ చర్యలు చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ యం. హనుమంత రావు అన్నారు. మంగళవారం చౌటుప్పల్ ఎంపీడీఓ ఆఫీస్‌లో మంచి నీటి సరఫరాపై పంచాయతీ కార్యదర్శిలతో సమీక్షా నిర్వహించారు. బోర్‌వెల్స్, హ్యాండ్‌పంప్‌లకు మరమ్మతులు చేపట్టాలన్నారు. మంచినీటి ట్యాంకుల పరిస్థితి, లీకేజీలపై పరిశీలన చేసి ట్యాంకుల మరమ్మతులు చేయించాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News November 13, 2025
తల్లి కష్టం చూసి.. గ్రూప్-1 ఉద్యోగం సాధించి..

ఖమ్మం: చిన్న తనం నుంచే తల్లి కండక్టర్‌గా పడుతున్న కష్టాన్ని చూసి, ఉన్నతస్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో గ్రూప్-1 ఉద్యోగం సాధించిన ధర్మపురి జగదీష్.. ఖమ్మం నూతన ఆర్టీఓగా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. తొలుత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ఆయన, ఆ తర్వాత పెద్ద ఆఫీసర్ కావాలనే లక్ష్యంతో పట్టుదలతో చదివి గ్రూప్-1లో విజయం సాధించారు. మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుంచి ఎదిగిన ఆయన తీరు నేటి యువతకు స్ఫూర్తిదాయకం.
News November 13, 2025
కృష్ణా: హత్య కేసులో ఏడుగురికి జీవిత ఖైదు

హత్య కేసులో ఏడుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కృష్ణా జిల్లా సెషన్స్ జడ్జి గోపి సంచలన తీర్పు ఇచ్చారు. బందరు (M) బుద్దాలపాలెంకు చెందిన కాగిత రామ్మోహనరావు 2013 ఫిబ్రవరి 28న దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న శొంఠి పైడేశ్వరరావు, బొర్రా శ్రీనివాసరావు, బొర్రా స్వామికృష్ణ, కాగిత సోమయ్య, శొంఠి వీర వెంకటేశ్వరరావు, శొంఠి వీరాంజనేయులు, శొంఠి ముసలయ్యకు జీవిత ఖైదు విధించారు.
News November 13, 2025
ప్రకాశం: రోడ్డు ప్రమాదంలో అయ్యప్ప భక్తుడి మృతి

ప్రకాశం జిల్లా పామూరు మండలం ఇనిమెర్ల ఎస్సీ పాలెం వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ఆటో ఢీకొట్టింది. పామూరు పట్టణంలోని ఆకుల వీధికి చెందిన అయ్యప్ప మాల ధరించిన చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఆటోలో ఉన్న మరికొందరికి గాయాలైనట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


