News March 11, 2025
ఉల్లాస్ పరీక్షలకు ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్

జిల్లాలో ఉల్లాస్ కార్యక్రమం కింద నమోదైన నిరక్షరాస్యులైన వయోజనులకు ఈనెల 23వ తేదీన నిర్వహించే పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఉల్లాస్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై వయోజన విద్యా, విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో ఉల్లాస్ శిక్షణ పూర్తిచేసిన 7,321 మంది పరీక్షకు హాజరవుతారన్నారు.
Similar News
News November 3, 2025
బాపట్ల పోలీస్ పీజీఆర్ఎస్‌కు 83 అర్జీలు: SP

బాపట్ల పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను SP ఉమామహేశ్వర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 83 అర్జీలు అందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫిర్యాదులను చట్టపరిధిలో వేగంగా పరిష్కరించాలన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజలు స్వయంగా వచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చని పేర్కొన్నారు. సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరిస్తామన్నారు.
News November 3, 2025
ప్రజావాణిలో 89 దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 89 దరఖాస్తులు అందినట్లు ఆయన తెలిపారు. ప్రజల వినతులను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.
News November 3, 2025
తాండూరు: పత్తి కొనుగోలును ప్రారంభించిన కలెక్టర్

తాండూర్ మహేశ్వరి కాటన్ జిన్నింగ్ మిల్లులో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు ప్రక్రియను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 3 జిన్నింగ్ మిల్లులలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం సీసీఐ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద పత్తి కొనుగోలు చేస్తోందన్నారు.


