News March 11, 2025

అమలాపురం: ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి

image

కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తరచూ జరిగే హాట్ స్పాట్లను గుర్తించి వాటి నివారణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ మహేశ్ కుమార్ జిల్లా రహదారి భద్రత కమిటీ సభ్యులకు సూచించారు. ఈ మేరకు మంగళవారం అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టవలసిన చర్యలపై, అవగాహన కార్యక్రమాల నిర్వహణ పై ఆయన అధికారులకు సూచనలు చేశారు.

Similar News

News July 5, 2025

ఫెన్సింగ్ పోటీల్లో కృష్ణా జిల్లా క్రీడాకారుల ప్రతిభ

image

మహారాష్ట్రలోని నాసిక్‌లో జరుగుతున్న 9వ జాతీయ ఫెన్సింగ్ పోటీల్లో కృష్ణా జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఇటీవల విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో వారు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ పోటీలకు ఎంపికైనట్లు కోచ్ విజయ్ తెలిపారు. జాతీయ ఫెన్సింగ్‌ పోటీల్లో పాల్గొనడం ద్వారా జిల్లా క్రీడా కారులు తమ ప్రతిభను దేశస్థాయిలో చాటుకున్నారని కోచ్ చెప్పారు.

News July 5, 2025

పీ-4 కార్యక్రమం నిర్వహణకు కలెక్టర్ ఆదేశాలు

image

పీ-4, స్వర్ణాంధ్ర-2047 కార్యక్రమాల అమలులో భాగంగా, ఆగస్టు 15వ తేదీలోగా బంగారు కుటుంబాల అనుసంధాన ప్రక్రియను పూర్తిచేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ ‘మీ-కోసం’ సమావేశ మందిరంలో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటికే 67 వేల బంగారు కుటుంబాలను గుర్తించినట్లు తెలిపారు.

News July 5, 2025

GDK: ‘అవినీతి, అంటరానితనాన్ని నిర్మూలించాలి’

image

ర్యాగింగ్, వరకట్నం, అవినీతి, అంటరానితనాన్ని నిర్మూలించాలని జిల్లా అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. గోదావరిఖని ప్రభుత్వ బాలికల కాలేజీలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరికీ చట్టాలపై అవగాహన ఉండాలన్నారు. కాలేజ్ ప్రిన్సిపల్ కల్పన, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తౌటం సతీష్, కిషన్ రావు, శంతన్ కుమార్, కోర్టు, కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు.