News March 23, 2024
NZB: ప్రేమ పెళ్లి.. ఒకరోజు ముందు లవర్ దుర్మరణం

పెళ్లికి ఒకరోజు ముందు ప్రియుడు మృతి చెందాడు. HYDలో ఉంటున్న శంకర్, నిజామాబాద్‌కు చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఈనెల 20న పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. ఊరెళ్లేందుకు 19న సిటీలో అమ్మాయిని బస్సెక్కించి.. తాను బైక్‌పై బయల్దేరాడు. కందుకూరులో కారు ఢీకొని శంకర్ గాయపడగా.. అదే రూట్‌లో వస్తున్న ప్రియురాలు గమనించి బస్ దిగేసింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శంకర్ చనిపోవడం బాధాకరం.
Similar News
News September 9, 2025
శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు 8 గేట్ల ద్వారా నీటి విడుదల

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 54,545 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. 8 వరద గేట్ల ద్వారా 25000 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్ట్ అధికారులు దిగువకు వదులుతున్నారు. IFFC 19,000, కాకతీయ 5,500, ఎస్కేప్ 2,500, సరస్వతి 800, లక్ష్మి 200, అలీసాగర్ 360, గుత్ప 270, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని కేటాయిస్తున్నారు. ప్రాజెక్టులో 1091 అడుగులకు నీటిమట్టం చేరుకోగా 80.501 TMC నీరుంది.
News September 9, 2025
NZB: మూడేళ్ల చిన్నారికి అరుదైన చికిత్స

NZBలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో మూడేళ్ల చిన్నారికి అరుదైన గుండె ప్రొసీజర్ విజయవంతమైంది. పుట్టిన వెంటనే సహజంగా మూసుకుపోవాల్సిన రక్తనాళం తెరుచుకొని ఉండటంతో చిన్నారి తీవ్ర సమస్యలు ఎదుర్కొంది. ఈ క్రమంలో వైద్యులు శస్త్రచికిత్స చేయకుండా ప్రత్యేక గుండె ప్రొసీజర్ ద్వారా రంద్రం మూసేసినట్లు Dr. సందీప్ రావు, సదానంద రెడ్డి ప్రకటించారు. చిన్నారికి సకాలంలో సరైన చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పిందని తెలిపారు.
News September 9, 2025
NZB: బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా గోపిడి స్రవంతి రెడ్డి నియామకం

బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా గోపిడి స్రవంతి రెడ్డి నియమితులయ్యారు. ఈ అవకాశం కల్పించినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీ ధర్మపురి అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తించి పార్టీ ఎదుగుదలకు శాయశక్తులా కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.