News March 11, 2025
నాగాయలంక: పనులను పునః ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే

నాగాయలంకలోని జలక్రీడల శిక్షణ కేంద్ర నిర్మాణ పనులను మంగళవారం కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌లు శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను పునః ప్రారంభించారు. సభలో కలెక్టర్ మాట్లాడుతూ.. జలక్రీడలపై నాగాయలంక అనువైన ప్రదేశమన్నారు. జాతీయ స్థాయి క్రీడాకారిణి నాగిడి గాయత్రి ఈ ప్రాంతం వాసి కావటంతో భవిష్యత్తులో నాగాయలంకకు దేశంలోనే గొప్ప ప్రఖ్యాతులు రానున్నాయని ఆశించారు.
Similar News
News March 12, 2025
గన్నవరం: వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణ నేడు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై నేడు (బుధవారం) విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ జరగనుంది. సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ అరెస్టై రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ఏ 71 గా వల్లభనేని వంశీ ఉన్నారు. ఇటీవల నియోజకవర్గ వ్యాప్తంగా వల్లభనేని వంశీ పై పలు కేసులు నమోదయ్యాయి.
News March 12, 2025
మచిలీపట్నం: సిమెంట్ ఫ్యాక్టరీకి ప్లాస్టిక్ వ్యర్థాలు: కలెక్టర్

కృష్ణా జిల్లాలో ప్లాస్టిక్ వాడకం నియంత్రించడానికి పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ DK బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజలు, వ్యాపారస్థుల నుంచి ప్లాస్టిక్ కప్పులు, కవర్లు, గ్లాసులు ఒకచోట పోగుచేసి వాటిని పంచాయతీ వాహనాల ద్వారా సిమెంట్ ఫ్యాక్టరీకి తరలించాలన్నారు.
News March 12, 2025
కృష్ణా: ఆ రెండు మండలాలకు హైఅలర్ట్

కృష్ణాజిల్లాలో బుధవారం అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తాయని APSDMA హెచ్చరించింది. ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. జిల్లాలోని రెండు మండలాలకు హైఅలర్ట్ ప్రకటించింది. ఉంగుటూరు 42.3 డిగ్రీలు, ఉయ్యూరు 42.6 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉండనున్నట్లు తెలిపింది. మిగిలిన చోట్ల 32 డిగ్రీలకు పైగా ఉండనున్నట్లు తెలిపింది.