News March 11, 2025

పంటలకు సాగునీరు అందించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు: కలెక్టర్

image

నల్గొండ జిల్లాలో ఆయా ప్రాజెక్టుల కింద సాగు చేస్తున్న పంటలకు సాగునీరు అందించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. ఈరోజు ఉదయ సముద్రం బ్యాలెన్స్ రిజర్వాయర్‌ను ఆమె సందర్శించారు. రబిలో సాగులో ఉన్న పంటలకు సాగునీరు అందటం లేదని వస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని అన్నారు. రైతులను తప్పుదోవ పట్టించి దుష్ప్రచారాలు చేసే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

Similar News

News April 17, 2026

మిల్లర్లు రైతులకు అండగా నిలవాలి: కలెక్టర్

image

నల్లగొండ జిల్లాలో రబీ ధాన్యం సేకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, మిల్లులకు వస్తున్న ధాన్యాన్ని ఏమాత్రం జాప్యం చేయకుండా అన్ లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మిల్లర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మిల్లర్లు, సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల నుంచి వస్తున్న ధాన్యం లోడుతో మిల్లుల వద్ద లారీలు పడిగాపులు కాయకూడదని అన్నారు.

News April 16, 2026

NLG: లక్ష్యం దిశగా రబీ కొనుగోళ్లు..

image

NLG జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 5,512 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, ఇప్పటివరకు జరిగిన మొత్తం కొనుగోళ్లు 36,360 మెట్రిక్ టన్నులకు చేరుకున్నాయి. సేకరించిన ధాన్యంలో 36,298 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 62 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం ఉంది. ఈ కొనుగోళ్ల ద్వారా ఇప్పటివరకు 4,112 మంది రైతులు లబ్ధి పొందారు.

News April 16, 2026

NLG: పాడి గేదెల పథకానికి లాస్ట్ డేట్ ఇదే

image

నల్గొండ జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం (ఎస్సీ కార్పొరేషన్) ద్వారా అమలు చేస్తున్న 2 పాడి గేదెల పథకం దరఖాస్తు గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. 70 శాతం సబ్సిడీతో కూడిన ఈ పథకానికి అర్హులైన ఎస్సీ అభ్యర్థులు OBMMS వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.