News March 11, 2025

గృహ నిర్మాణాలకు అదనంగా నగదు అందజేత

image

2019-24 మధ్యకాలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు గృహాలు మంజూరై ఇంకను వివిధ దశలలో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి అదనంగా ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కలెక్టర్ ఆనంద్‌ తెలిపారు. ఎస్సీ, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు అందజేస్తామన్నారు.

Similar News

News March 5, 2026

వెంకటగిరి: ఈ అమ్మాయిలు బంగారం.!

image

వెంకటగిరిలో విద్యార్థులు తమకు దొరికిన బంగారాన్ని పోలీసులకు అప్పజెప్పి మానవత్వం చాటుకున్నారు. కాజీపేటలో మార్గంలోని SBI బ్యాంక్ సమీపంలో రోడ్డుపై ZP బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు రూ.6,28,500 విలువ గల 4.5 సవర్ల బంగారం దొరికింది. వారు బంగారాన్ని ఎస్ఐ స్వరూపకు అందించారు. ఆ బంగారం పట్టణంలోని మహాలక్ష్మిదిగా గుర్తించి ఆమెకు అప్పగించారు. ఈ మేరకు విద్యార్థులను SI, బాధితురాలు అభినందించారు.

News March 5, 2026

ఎవరు చెప్పినా నేను వినను: మంత్రి నారాయణ

image

‘విజేతారెడ్డి, అనురాధ, రూప్, వీబీఆర్ దగ్గరకు వెళ్తే పనులవుతాయి అనుకోవద్దు. ఎవరు చెప్పినా నేను వినను’ అంటూ మంత్రి నారాయణ మాట్లాడినట్లు ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పార్టీలోనే వ్యతిరేక వర్గం తయారైందని ఆయన మండిపడినట్లు ఆడియోలో ఉంది. సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని, తన కోసం 700 మంది పని చేస్తున్నారని నారాయణ పేర్కొన్నారు.

News March 5, 2026

నెల్లూరు: ఈ నంబర్లు మీ దగ్గర ఉన్నాయా..?

image

వేసవికాలం దృష్ట్యా ప్రజలు ఫైర్ స్టేషన్‌కు సంబంధించిన ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచుకోవాలి. టోల్ ఫ్రీ నంబర్ 101, నెల్లూరు – 0861 2331051, 9963734284, కావలి – 08626 243101, 9963734286, ఆత్మకూరు – 08627 221222, 9963734394, పొదలకూరు -08621 225202, 9963734828, రాపూరు – 08621 226145, 9963735094, ఉదయగిరి- 08620 229251, 9963735314, వింజమూరు – 08629 214437, 9963735446, మర్రిపాడు- 08620 228800, 9963744817.