News March 11, 2025

గద్వాల: ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి

image

శాంతినగర్ పట్టణంలో జబల్ దేవాలయం వెనకాల ఉన్న బావిలో మద్దిలేటి (36) ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. స్థానికులు కథనం ప్రకారం వివరాలు.. మద్దిలేటికి సంబంధించిన బంధువులు దేవర చేస్తున్నారని దేవాలయానికి వచ్చిన అతను బావిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. అతను కల్లుకంట గ్రామవాసిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News September 14, 2025

వీఆర్‌ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వండి.. జగ్గారెడ్డికి వినతిపత్రం

image

జీవో నంబర్ 81 ప్రకారం మిగిలిపోయిన వీఆర్‌ఏ వారసులకు నియామక ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ వీఆర్‌ఏలు ఆదివారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఇంకా 61 మందికి ఉద్యోగాలు రాలేదని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని జగ్గారెడ్డి వారికి హామీ ఇచ్చారు.

News September 14, 2025

HYD: విద్యార్థినుల ఫోన్ నంబర్లు వారికెలా వచ్చాయి?

image

మహిళా వర్సిటీ విద్యార్థినులను వేధిస్తున్న ముగ్గురు యువకులను సుల్తాన్‌బజార్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ ముగ్గురికీ విద్యార్థినుల ఫోన్ నంబర్లు ఎలా వచ్చాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. నిందితుల్లో ఒకరు కార్ డ్రైవర్, మరొకరు హౌస్ కీపింగ్ బాయ్, మరొకరు డెలివరీ బాయ్. అంతమంది నంబర్లను ఎలా సేకరించారనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు.

News September 14, 2025

ఖైరతాబాద్: ‘ఈ నెల 24న బీసీ బతుకమ్మ నిర్వహిస్తాం’

image

ఈ నెల 24న ట్యాంక్ బండ్‌పై బీసీ బతుకమ్మను ఘనంగా నిర్వహిస్తామని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వేలాది మంది మహిళలు బీసీ బతుకమ్మ వేడుకలో పాలుపంచుకుంటారన్నారు. ఈ కార్యక్రమానికి అందరూ హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని కోరారు.