News March 11, 2025
సోమందేపల్లిలో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

సోమందేపల్లిలోని పాతఊరులో మంగళవారం విద్యార్థిని పూజిత (15) ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన ఈడిగ సురేశ్, సుధారాణిల కుమార్తె పాపిరెడ్డిపల్లిలోని కేజీబీవీలో పదో తరగతి చదువుతోంది. మంగళవారం విద్యార్థి ఇంటిలో ఉరేసుకుని మరణించింది. విద్యార్థి తన చావుకు ఎవరికి ఎటువంటి సంబంధం లేదు నాన్న అని రాసి ఉన్న లెటర్‌ను ఎస్ఐ రమేశ్ బాబు, ఏఎస్ఐ మురళి స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News July 6, 2025
కర్నూలు డీసీసీ ఇన్‌ఛార్జిగా లక్ష్మీ నరసింహ యాదవ్

కర్నూలు డీసీసీ ఇన్‌ఛార్జిగా నంద్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహ యాదవ్‌ను అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు శనివారం ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అంబటి రామకృష్ణ యాదవ్ స్థానంలో డీసీసీగా లక్ష్మీ నరసింహ యాదవ్‌ను నియమించడం పట్ల రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
News July 6, 2025
అనంత: ‘బెంగళూరు వెళ్తున్నానని చెప్పి లవర్‌ను పెళ్లి చేసుకుంది’

ప్రత్యేక కోర్సు కోసం బెంగళూరు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన అనంతపురం శ్రీనివాసనగర్‌కు చెందిన యువతి, ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుని తల్లిదండ్రులు షాకిచ్చింది. బీటెక్ పూర్తిచేసిన ఆమె జూన్ 20న ఇంటి నుంచి వెళ్లింది. కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా స్పందించలేదు. త్రీ టౌన్ PSలో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. శుక్రవారం ఆమె ఆచూకీ లభించగా, ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలిసింది.
News July 6, 2025
మహానందిలో క్షుద్ర పూజల కలకలం

మహానంది పుణ్యక్షేత్రం ఆవరణలోని గరుడ నంది పక్కన తాటి చెట్ల దగ్గర రెండు రోజుల క్రితం క్షుద్ర పూజలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలంలో స్త్రీ బట్టలు, క్షుద్ర పూజా సామగ్రి ఉండటం చూసిన గ్రామస్థులు భయాందోళ చెందుతున్నారు. ఈ చర్యకు పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.