News March 11, 2025
SKLM: జిల్లా అభివృద్ధి లక్ష్యాలను పూర్తి చేయాలి

ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అన్ని పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో రెవెన్యూ, గ్రామ సచివాలయం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, గృహ నిర్మాణం, పారిశుద్ధ్యం, అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు వంటి అంశాలపై చర్చించారు.
Similar News
News January 17, 2026
నేడు సిక్కోలు రచయిత చాసో జయంతి

సిక్కోలు గడ్డపై జన్మించిన ప్రముఖ రచయిత చాగంటి సోమయాజులు (చాసో) జయంతి నేడు. 1915 జనవరి 17న శ్రీకాకుళంలో జన్మించిన ఆయన, సామాన్యుల జీవితాలను తన కలంతో అద్భుతంగా ఆవిష్కరించారు. 1942లో ‘చిన్నాజీ’ కథతో ప్రయాణం మొదలుపెట్టి, ఐదు దశాబ్దాల కాలంలో 46కు పైగా ఆణిముత్యాల్లాంటి కథలను తెలుగు సాహిత్యానికి అందించారు. వాడుక భాషా కథలకు ప్రాణం పోసిన ఆయన రచనలు నేటికీ ఎంతో ప్రాచుర్యంలో ఉన్నాయి. 1994 జనవరి 1న మరణించారు.
News January 17, 2026
రణస్థలంలో యాక్సిడెండ్..యువకుడు స్పాట్ డెడ్

శ్రీకాకుళం జిల్లా రణస్థలం జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా తమ్మాపురం గ్రామానికి చెందిన కోటి(25) అనే యువకుడు మృతిచెందాడు. స్థానికుల వివరాలు మేరకు..తల్లిని శ్రీకాకుళం ఆసుపత్రికి తీసుకువెళ్లి తిరిగి విజయనగరానికి బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. జె.ఆర్‌పురం పోలీసులు కేసు నమోదు చేశారు.
News January 17, 2026
శ్రీ సూర్యనారాయణ స్వామి శోభా యాత్ర వాయిదా: కలెక్టర్

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థాన రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 19న జరగాల్సిన ‘శోభాయాత్ర’ను 23వ తేదీకి మారుస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ మృతికి సంబంధించిన సంతాప దినాలు జరుగుతున్నందున వాయిదా వేసినట్లు తెలిపారు. భక్తుల దర్శనానికి తగిన ఏర్పాట్లు చేశామన్నారు.


