News March 11, 2025
ఆదిలాబాద్ జిల్లాలో ఏసీబీ దాడులు

ఆదిలాబాద్ జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఎడ్యుకేషనల్ & వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జిన్నంవార్ శంకర్ రూ.50 వేల లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీకి పట్టుబడ్డాడు. ఆదిలాబాద్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ (బాలికలు) నిర్మాణ స్థలంలో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఆయనను పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 26, 2026
ADB: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

జిల్లాలో రోడ్డు ప్రమాదాల అడ్డుకట్టకు పోలీసులు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా వాహనదారుల రక్షణ కోసం స్పీడ్ బ్రేకర్లకు రాత్రి వేళల్లో స్పష్టంగా కనిపించేలా రిఫ్లెక్టివ్ పెయింటింగ్ వేయించారు. ప్రతి ప్రాణం విలువైనదని, వాహనదారులు విధిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. భద్రతా చర్యలు చేపడుతున్న పోలీసుల పనితీరును ప్రజలు అభినందిస్తున్నారు.
News March 26, 2026
ADB: 17 బాల్యవివాహాలు నిలిపివేత

ఆదిలాబాద్ జిల్లాలో పోలీస్ అక్క కార్యక్రమం ప్రజల విశేష ఆదరణ పొందుతోంది. గత నెలలో 60 గ్రామాల్లో 131 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 45 పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు భద్రతపై అవగాహన కల్పించారు. మొత్తం 25 ఫిర్యాదులు స్వీకరించి వేధింపులపై చర్యలు తీసుకున్నారు. చిన్నారుల సమాచారంతో 17 బాల్యవివాహాలు నిలిపివేశారు. ఉత్తమ సిబ్బందిని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు.
News March 26, 2026
ADB: పదికి 4 , ఇంటర్‌కు 3 పరీక్ష కేంద్రాలు

ఓపెన్ స్కూల్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, అందులో పదో తరగతికి 4, ఇంటర్‌కు 3 కేంద్రాలు కేటాయించినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్రతి కేంద్రంలో సీసీటీవీ కెమెరాల నిఘా ఉండాలని, తాగునీరు, వెలుతురు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని అన్నారు. పరీక్షా పత్రాల రవాణా, భద్రతకోసం పోలీస్ శాఖతో సమన్వయం చేసుకోవాలని, విద్యార్థుల కోసం ఉదయం 7 నుండే బస్సులు నడపాలన్నారు.


