News March 11, 2025

NRPT: వ్యవసాయ రంగానికి అధిక మొత్తంలో రుణాలు మంజూరు చేయాలి

image

ప్రాధాన్యత రంగాలైన అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈ లకు అధిక మొత్తంలో రుణాలు మంజూరు చేసి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్ లో నిర్వహించిన డీసీసీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయానికి రూ.3,470.93 కోట్లు, ఎంఎస్ఎంఈ రంగానికి రూ.310.30 కోట్లు రుణాలు అందించేందుకు లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు బ్యాంకు అధికారులు చెప్పారు.

Similar News

News September 18, 2025

VKB: ‘బియ్యాన్ని సమయానికి అందించాలి’

image

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు అందించే బియ్యాన్ని సమయానికి అందించాలని రైస్ మిల్లర్లకు అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ జిల్లాలోని రైస్ మిల్లర్లతో సివిల్ సప్లై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైస్ మిల్లర్లకు నిర్దేశించిన రైస్‌ను సకాలంలో అందిస్తే జిల్లాలోని రేషన్ షాపులకు త్వరగా పంపిణీ చేస్తామన్నారు.

News September 18, 2025

పార్వతీపురం: ‘స్వచ్ఛందంగానే బంగారు కుటుంబాల దత్తత’

image

స్వచ్ఛందంగానే బంగారు కుటుంబాల దత్తత ఉంటుందని, మార్గదర్శి నిర్ణయమే ముఖ్యమని జాయింట్ కలెక్టర్ సి. యస్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్ పి-4 బంగారు కుటుంబాల శిక్షణా తరగతులపై సమావేశం ఏర్పాటు చేశారు. బంగారు కుటుంబాల దత్తతకు మార్గదర్శకులు ముందుకు రావాలని కోరారు. ఇందులో ఎటువంటి ఒత్తిడి లేదని వారు స్వచ్ఛందంగా, ఇష్టపూర్వకంగానే రావచ్చని పేర్కొన్నారు.

News September 18, 2025

APకి 13వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపు

image

AP: రాష్ట్రానికి 13,050 మెట్రిక్ ట‌న్నుల యూరియా కేటాయిస్తూ కేంద్రం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీకి గంగవరం పోర్టు ద్వారా యూరియా రాష్ట్రానికి చేరనుంది. కాగా ఈ కేటాయింపుతో రైతులకు మ‌రింత‌ వెసులుబాటు కలుగుతుందని వ్య‌వ‌సాయ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఎరువుల కొరత లేకుండా చర్యలు చేపడుతున్నామని, రైతులు ఆందోళన చెందొద్దని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయన్నారు.