News March 11, 2025
సిరిసిల్ల: లింగనిర్ధారణ పరీక్షలు చేయడం నేరం: రజిత

గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. సిరిసిల్ల పట్టణంలో ఆశానోడల్ పర్సన్స్‌కు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కౌమార దశలో పిల్లలకు వారి యొక్క ఆరోగ్యం, శారీరక ఎరుగుదల, మానసిక ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించినట్టు ఆమె స్పష్టం చేశారు.
Similar News
News March 8, 2026
WBలో ప్రొటోకాల్ వివాదం.. అమిత్ షా, CBN ఏమన్నారంటే

ప.బెంగాల్‌లోని TMC ప్రభుత్వం తమ అరాచక ప్రవర్తనతో అథఃపాతాళానికి దిగజారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. ‘ప్రోటోకాల్ పాటించకుండా రాష్ట్రపతిని అవమానించారు. <<19322594>>ఈ ఘటన<<>> దేశానికి, ప్రజాస్వామ్యానికి అవమానం’ అని ట్వీట్ చేశారు. రాష్ట్రపతిని అవమానించేలా WB ప్రభుత్వం వ్యవహరించడం దురదృష్టకరమని, ఈ ఘటన బాధ కలిగించిందని AP CM CBN తెలిపారు. రాష్ట్రపతి పట్ల గౌరవంతో మెలగాలన్నారు.
News March 8, 2026
NZB: 246 కేసులు.. రూ 20.30 లక్షల జరిమానా: CP

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన రెండు వారాల్లో 246 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. కేసుల్లో పట్టుబడిన వారిని కోర్టుల్లో హాజరు పరచగా రూ.20.30 లక్షల జరిమానా విధించడం జరిగిందన్నారు. అలాగే 16 మందికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని CP వివరించారు.
News March 8, 2026
చరిత్రలో ఈరోజు (మార్చి 8)

1897: చిత్రకారుడు దామెర్ల రామారావు జననం
1917: విద్యుత్తు రంగ నిపుణుడు నార్ల తాతారావు జననం
1989: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ జననం
1993: చిలకలూరిపేట బస్సు దహనం ఘటనలో 23 మంది మృతి
2012: సినీ నటి రాధాకుమారి మరణం
☛ అంతర్జాతీయ మహిళా దినోత్సవం


