News March 11, 2025
యాదాద్రి: రోడ్డు పక్కన ఆడ శిశువు మృతదేహం

యాదాద్రి భువనగిరి జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. యాదగిరిపల్లిలోని పాలిటెక్నిక్ కాలేజీ వద్ద రోడ్డు ప్రక్కన ఆడ శిశువు మృతదేహం లభ్యమైంది. స్థానికులు ఆడ శిశువు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శిశువు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 13, 2025
నెల్లూరు లేడీ డాన్ అరుణను పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి

నెల్లూరు లేడీ డాన్ అరుణను పోలీస్ కస్టడికి ఇచ్చేందుకు విజయవాడ కోర్ట్ బుధవారం అనుమతి ఇచ్చింది. వారంపాటు కస్టడీ ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చెయ్యగా… కోర్టు రెండు రోజులు మాత్రమే అనుమతి ఇచ్చింది. దీంతో నెల్లూరు జిల్లా జైలులో ఉన్న ఆమెను 13,14 తేదీల్లో విచారించేందుకు సూర్యారావు పేట పోలీసులు తీసుకెళ్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసినట్లు ఆమెపై కేసు నమోదు అయింది.
News November 13, 2025
వరంగల్ జిల్లాలో చలి పంజా

వరంగల్ జిల్లా వ్యాప్తంగా చలికాలం మొదలైంది. ఉదయాన్నే విపరీతమైన చలితో పాటు మంచు కమ్మేస్తోంది. ఉష్ణోగ్రతలు 17 డిగ్రీల వరకు పడిపోతున్నాయి. ఉదయం 10 గంటల వరకు చలి తీవ్రత ఎక్కువగా కొనసాగుతోంది. దీంతో రోడ్లపై వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామున బయటకు వెళ్లే వారు తప్పనిసరిగా జాకెట్లు, మఫ్లర్లు ఉపయోగించాలని వైద్యులు సూచించారు.
News November 13, 2025
అల్పపీడనం.. రెండు రోజులు భారీ వర్షాలు

AP: ఈ నెల 17న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని IMD తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అయితే తీవ్ర ప్రభావం ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఇవాళ పలు జిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది. నిన్న అల్లూరిలోని ముంచింగి పుట్టులో 14.4, డుంబ్రిగుడలో 14.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


