News March 11, 2025
గ్రూప్-2 ఫస్ట్ ర్యాంకర్ ఇతనే

TG: టీజీపీఎస్సీ వెల్లడించిన గ్రూప్-2 ఫలితాల్లో నారు వెంకట హర్షవర్ధన్ రెడ్డి ఫస్ట్ ర్యాంక్ సాధించారు. 600 మార్కులకుగానూ 447.088 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారు. కాగా హర్షవర్ధన్ సూర్యాపేట జిల్లా కోదాడ వాసి. ఆయన తండ్రి రమణారెడ్డి కేఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. హర్షవర్ధన్ ఏడో తరగతి వరకు ఖమ్మం, 8 నుంచి ఇంటర్ వరకు విజయవాడ, బీటెక్ తాడేపల్లిగూడెంలో చదివారు.
Similar News
News January 1, 2026
మద్యం విక్రయాలకు న్యూ ఇయర్ కిక్కు

AP: మద్యం అమ్మకాలు డిసెంబర్(2025)లో గణనీయంగా పెరిగి ₹2,767 కోట్ల ఆదాయం సమకూరింది. 2024లో ఇదే నెలలో ₹2,568 కోట్లు వచ్చాయి. న్యూ ఇయర్ వేడుకలు, వరుస సెలవుల రాకతో 29, 30, 31 తేదీల్లో ఏకంగా ₹543 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. 2024లో ఇది ₹336 కోట్లు మాత్రమే. అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో ₹178.6 కోట్ల విలువైన మద్యాన్ని మందుబాబులు కొనుగోలు చేశారు.
News January 1, 2026
KCR అసెంబ్లీకి రావాలి.. ఎలాంటి ఆటంకం కలిగించం: సీఎం రేవంత్

TG: జల వివాదాలపై మాట్లాడేందుకు BRS చీఫ్, మాజీ సీఎం KCR అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ అన్నారు. సభలో ఆయన గౌరవానికి, వాదనలకు ఎలాంటి ఆటంకం కలిగించబోమని స్పష్టం చేశారు. ‘ఎవరి బాగు కోసం పాలమూరు ప్రాజెక్టు ఎత్తిపోతల సోర్స్‌ను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చారు. కమీషన్లు ఎవరికి వెళ్లాయి. దీనిపై విచారణ జరగాలి’ అని వ్యాఖ్యానించారు. అబద్ధాల పోటీలో KCR, KTR, హరీశ్ రావుకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందన్నారు.
News January 1, 2026
నీటిపై పాఠాలు మీ దగ్గర నేర్చుకోవాలా?: హరీశ్

TG: నదీ జలాలపై పాఠాలు మీ దగ్గర నేర్చుకోవాలా? అని BRS నేత హరీశ్ CM రేవంత్‌పై ధ్వజమెత్తారు. ‘మీరు మాకు ఉపన్యాసాలు ఇస్తారా? మేడిగడ్డను ఎలా పేల్చారు, సుంకిశాలను ఎలా కూల్చారో చూపిస్తారా? కృష్ణాపై హక్కులను KRMBకి ఎలా అప్పగించారో చెబుతారా?’ అని ప్రశ్నించారు. ఈ రెండేళ్లలో అదనంగా ఒక్క ఎకరాకైనా సాగునీరు అందించారా? అని నిలదీశారు. సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు తమకూ అవకాశమివ్వాలని డిమాండ్ చేశారు.


