News March 11, 2025

ఎలా డైట్ చేస్తే మంచిది?

image

వెంటనే బరువు తగ్గాలని కొందరు చేస్తున్న డైట్ ప్రాణాలకు ముప్పు తెస్తోంది. తాజాగా కేరళ యువతి <<15712364>>శ్రీనంద<<>> ఇలాగే ఆహారం మానేసి 5నెలల పాటు నీళ్లే తాగి చనిపోయింది. రోజూ మనం తీసుకునే ఫుడ్‌లో 500క్యాలరీల చొప్పున తగ్గిస్తే.. వారానికి 0.5కేజీ, నెలకు 2కిలోలు తగ్గుతామని వైద్యులు చెబుతున్నారు. ఇది ఆరోగ్యవంతమైన డైట్ అని అంటున్నారు. కొందరు 24- 72hrs కేవలం నీళ్లతోనే డైట్ చేస్తారని ఇది ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.

Similar News

News April 1, 2026

సెన్సస్: మోదీ సెల్ఫ్ ఎన్యూమరేషన్

image

దేశవ్యాప్తంగా తొలి దశ జనగణనలో భాగంగా ఇవాళ్టి నుంచి హౌస్ లిస్టింగ్, హౌసింగ్ ఆపరేషన్స్ నమోదు ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ <<19530324>>సెల్ఫ్ ఎన్యూమరేషన్<<>> పూర్తి చేశారు. ఈ ఫొటోలను SMలో పోస్టు చేశారు. ‘సెన్సస్ పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతుండటం ఇదే తొలిసారి. ఇంటి వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. దేశ ప్రజలంతా ఇందులో భాగం కావాలి’ అని పిలుపునిచ్చారు.

News April 1, 2026

PHOTO GALLERY: పండు వెన్నెల్లో అందాల రామయ్య పెళ్లి

image

AP: కడప(D) ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ పండు వెన్నెల్లో సీతారాముల కళ్యాణం చూసి వేలాది మంది భక్తులు పులకించిపోయారు. శ్రీరామ నామస్మరణతో ఆలయం ప్రతిధ్వనించింది. అంతకుముందు సీఎం చంద్రబాబు దంపతులు స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కాగా ఈ నెల 5వ తేదీ వరకు ఒంటిమిట్టలో ఉత్సవాలు కొనసాగనున్నాయి.

News April 1, 2026

రేపు KKRతో SRH ఢీ.. జట్టు ఇదేనా?

image

IPL: ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో ఓడిన SRH రేపు KKRను ఢీకొట్టనుంది. బౌలర్ల వైఫల్యం ఆ జట్టును వేధిస్తోంది. గాయాలతో బాధపడుతున్న కమిన్స్, బ్రైడన్ కార్స్ రేపు ఆడటం డౌటేనని సమాచారం. లివింగ్‌స్టోన్ జట్టులోకి రావడమూ కష్టమేనని తెలుస్తోంది. దీంతో జట్టులో మార్పులు ఉండకపోవచ్చని నిపుణుల అంచనా.
ప్రిడిక్టెడ్-11: అభిషేక్, హెడ్, ఇషాన్, నితీశ్, క్లాసెన్, అరోరా, అనికేత్, హర్షల్, హర్ష్, జయ్‌దేవ్, ఎషాన్