News March 11, 2025

KCRను కలిసిన దాసోజు శ్రవణ్

image

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజు శ్రవణ్ మాజీ సీఎం కేసీఆర్‌ను కలిశారు. తనకు MLCగా అవకాశం ఇచ్చినందుకు కుటుంబ సమేతంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. అటు దాసోజుకు కేసీఆర్ అభినందనలు తెలిపారు.

Similar News

News March 12, 2025

ఒకే ఫ్రేమ్‌లో నాని, విజయ్ దేవరకొండ, మాళవిక

image

నాని, విజయ్ దేవరకొండ, మాళవికా నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా ఈనెల 21న రీరిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నటీనటులు 10 ఏళ్ల తర్వాత ఒక్కచోటకు చేరారు. సినిమాలో ఉన్నట్లు ఒకే బైక్‌పై ముగ్గురు కూర్చొని కెమెరాలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. ఇండస్ట్రీలో ఇన్నేళ్లలో ఎన్నో మార్పులొచ్చినా వీరి బాండింగ్ మారలేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News March 12, 2025

ఏడాదిలోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చాం: రేవంత్

image

TG: తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ తెలిపారు. ఏడాదిలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర తమదేనని చెప్పారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన కొలువుల పండగలో 1,532 మందికి సీఎం నియామక పత్రాలు అందజేశారు. ‘కేసీఆర్ ఫ్యామిలీకి ఉద్యోగాలు పోవడం వల్లే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయి. గత పన్నెండేళ్లలో ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు’ అని ఆయన పేర్కొన్నారు.

News March 12, 2025

గవర్నర్‌కు KTR క్షమాపణలు చెప్పాలి: మహేశ్ కుమార్

image

TG: గవర్నర్ ప్రసంగాన్ని అవమానపరిచేలా KTR <<15732904>>మాట్లాడారని <<>>పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అధికారం పోయినా, ఆయనలో అహంకారం తగ్గలేదని దుయ్యబట్టారు. KTR గవర్నర్‌కు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అటు ప్రతిపక్ష నేతగా KCR అసెంబ్లీకి రావడాన్ని మహేశ్ కుమార్ స్వాగతించారు. ప్రభుత్వానికి KCR సలహాలు ఇవ్వాలని సూచించారు.

error: Content is protected !!