News March 11, 2025

పార్వతీపురం స్పెషల్ ఆఫీసర్ భరత్ గుప్తా నియామకం

image

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనా సౌలభ్యం కోసం మంగళవారం రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలకు ప్రత్యేక అధికారులుగా ఐఏఎస్ అధికారులను నియమించింది. దీనిలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాకు ప్రత్యేక అధికారిగా ఆంధ్రప్రదేశ్ నారాయణ భరత్ గుప్తా ఐఏఎస్‌ను నియమించింది. దీంతో బాటు రాష్ట్రంలో ఉన్న 5జోన్లకు జోనల్ అధికారులను కూడా నియమించింది.

Similar News

News March 24, 2026

మెదక్ డిగ్రీ కళాశాలలో నేడు జాబ్ మేళా

image

మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 24న ఉదయం 11:00 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ హుస్సేన్ తెలిపారు. ప్రముఖ ఔషధ సంస్థ ఎంఎస్ఎన్ లాబొరేటరీస్ ఆధ్వర్యంలో ఈ నియామకాలు జరుగుతాయని పేర్కొన్నారు. కళాశాల సెమినార్ హాల్‌లో జరిగే ఈ కార్యక్రమానికి కన్వీనర్‌గా డాక్టర్ ప్రవీణ్ కుమార్ వ్యవహరిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News March 24, 2026

మార్చి 24: చరిత్రలో ఈరోజు

image

1603: బ్రిటిషు మహారాణి ఎలిజబెత్ మరణం
1775: కవి, వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితులు జననం
1882: క్షయ వ్యాధికి కారణమైన మైకోబాక్టీరియా ట్యుబర్‌క్యులాసిస్‌ను రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు
1977: భారత ప్రధానిగా మొరార్జీ దేశాయ్ బాధ్యతలు (ఫొటోలో)
1984 : భారత హాకీ క్రీడాకారుడు ఆడ్రియన్ డిసౌజా జననం
1991: సినీ గేయ రచయిత చెరువు ఆంజనేయ శాస్త్రి మరణం
* ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం

News March 24, 2026

వరంగల్ పరిధిలో 41 ట్రాఫిక్ ఉల్లంఘన కేసు నమోదు

image

వరంగల్ నగరంలో సోమవారం పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 41 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 36మందిని, లైసెన్స్ లేని మరో ఐదుగురుని పట్టుకున్నట్లు సీఐ సుజాత తెలిపారు. నిందితులకు కోర్టు జరిమానా విధించడంతో పాటు కౌన్సెలింగ్ ఇచ్చారు. వాహనదారులు నిబంధనలు పాటించాలని, అతిక్రమిస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.