News March 12, 2025
నంద్యాల జిల్లా TODAY TOP NEWS.!

☞ జిల్లాకు చెందిన పదవ తరగతి ప్రశ్న పత్రాలు☞ గాజులపల్లె మెట్ట వద్ద డ్రైనేజ్ కాలువ దుర్గంధం☞ జొన్నకు మద్దతు ధర కల్పించండి: మంత్రులు☞ పాండవగల్లులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం☞ మంత్రి బీసీపై విమర్శలు తగవు: టీడీపీ నేతలు☞ పదవ తరగతి విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం☞ TDP MLC అభ్యర్థి బీటీ నాయుడు ఆస్తులు రూ.5.68 కోట్లు ☞ పోసాని కేసు.. ఆదోని పోలీసుల కస్టడీ పిటిషన్ డిస్మిస్
Similar News
News March 12, 2025
NRPT: వార్డు ఆఫీసర్‌ను అభినందించిన కమిషనర్

నారాయణపేట మున్సిపాల్టీలో వార్డు ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న వేణు నిన్న విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో 31వ ర్యాంకు సాధించి ఉద్యోగం సంపాదించాడు. దీంతో బుధవారం మున్సిపల్ కమిషనర్ బొగేశ్వర్లు వేణును శాలువాతో సన్మానించి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. మునుముందు మరిన్ని ఉన్నత పదవులు సంపాదించాలని కోరారు. మున్సిపల్ సిబ్బంది వేణుకు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
News March 12, 2025
నెల్లూరు: ‘ప్లాన్ తయారు చెయ్యడంలో శ్రద్ధ తీసుకోండి’

నియోజకవర్గ స్థాయి స్వర్ణాంధ్ర – 2047 ప్రణాళిక తయారు చేయడంలో నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు అత్యంత శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో స్వర్ణాంధ్ర – 2047 యాక్షన్ ప్లాన్‌ను నియోజకవర్గ స్థాయిలో తయారు చేసేందుకు వర్క్ షాప్ నిర్వహించారు. GDDPపై వివిధ శాఖల జిల్లా అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులకు పాల్గొన్నారు.
News March 12, 2025
మల్దకల్లో 37 9°c ఉష్ణోగ్రతలు నమోదు

గద్వాల జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నందున ఫ్యాన్లు, కూలర్లు వాడకం పెరిగింది. రేపటి నుంచి పగటిపూట ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారం మల్దకల్ మండల కేంద్రంలో అత్యధికంగా 37 9°c, గద్వాల్లో 37.3°c, అలంపూర్‌లో 37.1°c, సాతర్లలో 36.7°c ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.