News March 23, 2024

విశాఖ: ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్

image

నగర పరిధిలోని చినగదిలి వద్ద గల ఈవీఎం గోదాములను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున శనివారం తనిఖీ చేశారు. ప్రతి మూడు మాసాలకు చేసే తనిఖీలో భాగంగా గోదాములను సందర్శించి అక్కడ పరిస్థితిని పరిశీలించారు. వివిధ పార్టీల ప్రతినిధులతో కలిసి గోదాముల లోపల గల వీవీ ప్యాట్లను, ఇతర సామగ్రిని స్వయంగా పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును గమనించిన ఆయన సిబ్బందికి సూచనలు ఇచ్చారు.

Similar News

News September 9, 2025

విశాఖ జూపార్క్‌లో తెల్ల గడ్డం కోతులు

image

విశాఖ జూ పార్కులో తెల్ల గెడ్డం కోతులు సందర్శకులను ఎంతగానో అలరిస్తున్నాయి. వీటిని పర్వత కోతులు అని పిలుస్తారు. నల్లటి కోటు ధరించినట్టు కనిపిస్తూ, గెడ్డం చుట్టూ తెల్ల బొచ్చుతో వింత హావభావాలతో ఈ కోతులు జూ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇవి పళ్ళు, విత్తనాలు, లేత ఆకులను ఆహారంగా తీసుకుంటాయి. కనువిందు చేసే ఈ కోతులను చూడాలంటే మరి మీరు కూడా విశాఖ జూ పార్కును సందర్శించాల్సిందే.

News September 9, 2025

మధురవాడ సీవరేజ్ ప్రాజెక్టుకు I.F.Cతో ఒప్పందం

image

మధురవాడ సీవరేజ్ ప్రాజెక్టుకు జీవీఎంసీ, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (I.F.C.) మధ్య ఒప్పందం కుదిరింది. రూ.553 కోట్లు చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కోసం విజయవాడలో సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం జరిగింది. ఐ.ఎఫ్.సి.తో దేశంలో తొలిసారి జీవీఎంసీ ఒప్పందం కుదుర్చుకుందని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఈ ప్లాంట్ 225 ఎం.ఎల్.డి వ్యర్థచరాలను శుద్ధి చేస్తుందని చెప్పారు

News September 8, 2025

విశాఖ జిల్లాలో 67.56% స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ పూర్తి

image

విశాఖ జిల్లాలో కేటాయించిన 5,17,155 స్మార్ట్ రైస్ కార్డులలో 67.56% పంపిణీ పూర్తయింది. మండలాల వారీగా అనందపురం 84.35%, భీమునిపట్నం 79.74%, సర్కిల్-III అర్బన్ 71.93%, సర్కిల్-I అర్బన్ 59.26% పూర్తి అయ్యాయి. మిగిలిన వారికి త్వరలోనే సచివాలయ సిబ్బంది/డీలర్ల ద్వారా అందజేస్తామని.. కార్డు వివరాలు epds పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చని కలెక్టర్ హరేంధీర ప్రసాద్ తెలిపారు.