News March 12, 2025

బోరుగడ్డ అనిల్‌పై హైకోర్టుకు రాజమహేంద్రవరం పోలీసుల లేఖ

image

AP: మధ్యంతర బెయిల్ గడువు మంగళవారంతో ముగిసినా బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగిపోలేదని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు అధికారులు రాష్ట్ర హైకోర్టుకు సమాచారాన్ని అందించారు. ఈ మేరకు లేఖ రాశారు. రిమాండ్ ముద్దాయిగా ఉన్న అనిల్‌పై తగిన చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. తన తల్లికి వైద్య చికిత్స కోసమని చెప్పి అనిల్ మధ్యంతర బెయిల్ తీసుకున్న సంగతి తెలిసిందే.

Similar News

News March 12, 2025

4 నెలల్లో ₹86లక్షల కోట్లు ఆవిరి.. గ్లోబల్ మార్కెట్లో తగ్గిన భారత వాటా

image

నిఫ్టీ, సెన్సెక్స్ క్రాష్‌తో గత 4 నెలల్లోనే రూ.86లక్షల కోట్ల ($1T) మార్కెట్ విలువ నష్టపోయిందని బ్లూమ్‌బర్గ్ రిపోర్టు పేర్కొంది. దీంతో ప్రపంచ మార్కెట్ విలువలో భారత వాటా తగ్గిపోయింది. 20 రోజుల సగటు లెక్కింపు ప్రకారం గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లో గత ఏడాది 4% ఉన్న ఈ విలువ ఇప్పుడు 3%కు పడిపోయింది. సాధారణంగా సంక్షోభం తర్వాత 70 రోజుల్లో రికవరీ బాట పట్టే సూచీలు అనిశ్చితితో వరుసగా 5 నెలలు నష్టాల్లో ముగిశాయి.

News March 12, 2025

విప్‌లు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ క్లాస్

image

TG: అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలు నిరసనలు చేస్తుంటే ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్యేలు అడ్డుకోకుండా ఏం చేస్తున్నారంటూ సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటుంటే ఎందుకు స్పందించలేదని సీఎల్పీ మీటింగ్‌లో వారికి క్లాస్ తీసుకున్నారు. ప్రభుత్వ విప్‌లు పనితీరు మార్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో సభ్యుడు ఒక్కో విషయాన్ని పంచుకోవాలని సూచించారు. సభకు సభ్యులందరూ హాజరు కావాలని పేర్కొన్నారు.

News March 12, 2025

ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా గిల్

image

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎంపికయ్యారు. గత నెలలో అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకుగానూ ఆయనను ఈ అవార్డు వరించింది. గత నెలలో 5 వన్డేలాడి 94.19 యావరేజ్‌, 101.50 స్ట్రైక్ రేట్‌తో 406 పరుగులు బాదారు. ఇందులో ఓ సెంచరీ సహా మూడు వరుస ఫిఫ్టీలు ఉన్నాయి. స్టీవ్ స్మిత్, గ్లెన్ ఫిలిప్స్ గట్టి పోటీ ఉన్నా వారిని వెనక్కి నెట్టి గిల్‌ ఈ అవార్డు దక్కించుకున్నారు.

error: Content is protected !!