News March 12, 2025
కేజీబీవీని తనిఖీ చేసిన MHBD కలెక్టర్

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ ప్రభుత్వ బాలికల పాఠశాలను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ సింగ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పెడుతున్న భోజనం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల పరిశాలను పరిశీలిస్తూ.. పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
Similar News
News March 16, 2026
NRPT: మూడు నెలల్లో కలెక్టరేట్ పనులు పూర్తి చేయాలి: ప్రతీక్ జైన్

నారాయణపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం కూడలి వద్ద రూ.55 కోట్ల నిధులతో కొనసాగుతున్న నూతన కలెక్టరేట్ భవన సముదాయ నిర్మాణ పనులను సోమవారం కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించారు. ఇవాళ బాధ్యతలు చేపట్టిన ఆయన నేరుగా నూతన కలెక్టరేట్ నిర్మాణ పనుల పరిశీలనకు వచ్చారు. నిర్మాణ పనుల వివరాలను ఆర్ అండ్ బి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మూడు నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
News March 16, 2026
ఆసిఫాబాద్: గ్రీవెన్స్ డేలో 12 ఫిర్యాదుల స్వీకరణ

ASF జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నితికా పంత్ ప్రజల నుంచి మొత్తం 12 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రధానంగా భూ వివాదాలు, కుటుంబ కలహాలు, సివిల్ తగాదాలపై వినతులు అందాయి. బాధితుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. ప్రజలకు న్యాయం చేయడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.
News March 16, 2026
పారదర్శకంగా పదో తరగతి పరీక్షలు: డీఈవో

మచిలీపట్నంలోని పదో తరగతి పరీక్షా కేంద్రాలను డీఈవో యు.వి. సుబ్బారావు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిలకలపూడి సీపీఎం హైస్కూల్, నిర్మల, హైని, శ్రీ బాలాజీ, ఎంఈకే బాలాభాను తదితర పాఠశాలల్లో పరీక్షల సరళిని పరిశీలించారు. విద్యార్థులకు కల్పించిన వసతులను సమీక్షించిన ఆయన, ఎక్కడా అక్రమాలకు తావులేకుండా పరీక్షలను సజావుగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.


