News March 12, 2025
అభివృద్ధి పనులు నెలాఖరులోగా పూర్తి చేయాలి: కలెక్టర్

జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలని ASF కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం ASF కలెక్టరేట్ భవనంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పంచాయితీ, హౌసింగ్, మండల పంచాయతీ అధికారులతో అభివృద్ధి పనుల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
Similar News
News November 8, 2025
హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు లేదు: HMRL

HYD మెట్రో ఛార్జీల పెంపు అని వస్తోన్న వార్తలపై HMRL క్లారిటీ ఇచ్చింది. తక్షణమే ఛార్జీలు పెంచే ఆలోచన లేదని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలతోనే మెట్రో సేవలు కొనసాగనున్నాయని స్పష్టం చేశారు. కేంద్రం ఏర్పాటు చేసిన ఛార్జీల నిర్ధారణ కమిటీ సిఫారసుల ఆధారంగా మే 24, 2025 నుంచి ఛార్జీల సవరణ అమలు చేశామని గుర్తు చేశారు. ఛార్జీల పెంపు అవాస్తవమని FactCheck_Telangana ధ్రువీకరించింది.
SHARE IT
News November 8, 2025
DEC 1 నుంచి పార్లమెంట్ సమావేశాలు

డిసెంబర్ 1 నుంచి 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేలా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్మాణాత్మక చర్చల కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
News November 8, 2025
వేదాల గురించి ప్రముఖులు ఏమన్నారంటే..?

వేదాల గురించి భారతీయ ప్రముఖులు గొప్పగా ప్రవచించారు. ఆదిశంకరులు వేదాలను కన్నవాళ్ల కంటే అధిక హితాన్ని, శుభాలను కోరుకునేవిగా పేర్కొన్నారు. అవి మానవాళికి అత్యున్నత శ్రేయస్సును అందిస్తాయన్నారు. వివేకానందుడు వేదాలు అపూర్వమైన శక్తికి స్థానాలని చెప్పారు. వాటిని చదివితే ఈ లోకాన్ని ఇంకా శక్తిమంతం చేయొచ్చని చెప్పారు. వ్యక్తిగత, విశ్వ శ్రేయస్సుకు వేద జ్ఞానం మూలమని యువతకు మార్గనిర్దేశం చేశారు. <<-se>>#VedikVibes<<>>


