News March 12, 2025
తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో విద్యుత్ కాంతుల శోభ

వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం శోభాయమానంగా అలంకరించారు. జెండాలు, ఫ్లెక్సీలు, రంగురంగుల విద్యుత్ దీపాలతో కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్య నేతలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఈ వేడుకలో పాల్గొననున్నారు.
Similar News
News November 9, 2025
హిందువులు మీతో లేరని ఒప్పుకుంటారా?: రేవంత్

TG: జూబ్లీహిల్స్ ప్రజల్లో 80% హిందువులు BJP వైపు ఉన్నారన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై CM రేవంత్ సెటైర్లు వేశారు. ‘ఈ ఎన్నికల్లో BJP డిపాజిట్ పోతుంది. రాసిపెట్టుకోండి. మీరు ఓడిపోతే హిందువులు మీతో లేరు అని భావించాలి’ అని ఛాలెంజ్ విసిరారు. BRS గెలుపు కోసం జూబ్లీహిల్స్లో BJP పనిచేస్తోందన్నారు. BRS విలీనమైతే వచ్చే లాభంపై ఇక్కడ రెండు పార్టీలు లిట్మస్ టెస్ట్ చేసుకుంటున్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
News November 9, 2025
నిట్ వరంగల్లో ఉచిత GATE శిక్షణకు దరఖాస్తులు

వరంగల్ నిట్లో ఉచిత GATE కోచింగ్ నిర్వహిస్తున్నట్లు నిట్ డైరెక్టర్ ప్రొ.బిద్యాధర్ సుబుధి తెలిపారు. అన్ని వర్గాల విద్యార్థులు శిక్షణలో పాల్గొనవచ్చని తెలిపారు. ఈ కోచింగ్ అన్ని ఇంజినీరింగ్ విభాగాలను కవర్ చేస్తూ 17 నవంబర్ 2025 నుంచి 9 జనవరి 2026 వరకు 8 వారాల పాటు కొనసాగుతుందన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News November 9, 2025
నవీన్ యాదవ్ రౌడీ కాదు: CM రేవంత్

నవీన్ యాదవ్ రౌడీ కాదని CM రేవంత్ రెడ్డి అన్నారు. B.Arch చేసి, ప్రజా సేవలో ఉన్న యువకుడు నవీన్ అంటూ CM పేర్కొన్నారు. ‘తన తండ్రిని చూసి రౌడీ అన్ని ముద్ర వేస్తున్నట్లు నవీన్ యాదవ్ ఇప్పటికే చెప్పారు. పాస్పోర్టు బ్రోకర్ కొడుకు ఏం అవుతారని కూడా ఆయన నిలదీశారు. దీనిపై BRS సమాధానం చెప్పాలి. టికెట్ ఇచ్చిన అని నేను ఏం చెప్పడం లేదు. నవంబర్ 14న జూబ్లీహిల్స్ ప్రజలే తీర్పు చెబుతారు’ అని CM రేవంత్ తెలిపారు.


