News March 12, 2025
పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి సూచనలు

పల్నాడు జిల్లాలో పదవ తరగతి దూరవిద్య పరీక్షలకు 1,200 మంది హాజరవుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారిని ఎల్ చంద్రకళ తెలిపారు. మొత్తం 27 పరీక్షా కేంద్రాలలో 57 మంది ఇన్విజిలేటర్ల పర్యవేక్షణలో 27 మంది చొప్పున చీఫ్ సూపరిండెంట్లు, సిట్టింగ్ స్క్వాడ్లు పరీక్షలు జరుపుతారు అన్నారు. మండల విద్యాశాఖ అధికారులు ఆయా పరీక్షా కేంద్రాలలో మౌలిక వసతులను పరిశీలించాలని డీఈవో ఎల్ చంద్రకళ ఆదేశాలు ఇచ్చారు.
Similar News
News January 26, 2026
వేసవి ఉల్లి సాగుకు సూచనలు

వేసవి పంట కోసం ఉల్లిని సాగు చేయాలనుకుంటే ఈ నెలలోనే సిద్ధమవ్వాలి. పంట కొరకు ముందుగా నారును పెంచుకోవాలి. నారుమడి కోసం నేలను దున్ని 4 మీటర్ల పొడవు, 1 మీటరు వెడల్పు, 15 సెంటీ మీటర్ల ఎత్తు గల 10 మళ్లను తయారు చేసుకోవాలి. ఒక కిలో విత్తనానికి కాప్టాన్ లేదా థైరమ్‌ను 3గ్రా. లేదా ట్రైకోడెర్మావిరిడె 4 గ్రాములు పట్టించి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి.
News January 26, 2026
జగిత్యాల: “రాజ్యాంగ విలువలకు కట్టుబడి సేవలు”

77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు, సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ విలువలకు కట్టుబడి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు. పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన స్టాల్స్, డాగ్ స్క్వాడ్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
News January 26, 2026
HYD: డక్కన్‌ను ఏలిన ధీరవనిత

<<18954194>>రుద్రమదేవి..<<>>దక్షిణ భారత సింహాసనాన్ని అధిరోహించిన తొలి ధీరవనిత. కాకతీయ వంశంలో కాంతులు చిందించిన మహారాణి. దేవగిరి రాజు మహాదేవుడి దండయాత్రలను ధైర్యసాహసాలతో తిప్పికొట్టిన ధైర్యశాలి. నాయంకర వ్యవస్థను అమలు చేసి చరిత్రలో నిలిచారు. గొలుసుకట్టు చెరువులకు ఆజ్యం పోసి నీటిని ఒడిసిపట్టేలా చేశారు. ఓరుగల్లు కోటకు మెరుగులద్దారు. 8పదుల వయసులో కదన రంగంలోకి దిగి కాయస్త అంబదేవుడితో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందారు.


