News March 12, 2025
VKB విద్యుత్ SEగా రవిప్రసాద్ బాధ్యతలు

విద్యుత్ శాఖ వికారాబాద్ సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా రవి ప్రసాద్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఎస్సీగా పనిచేసిన లీలావతి నారాయణపేటకు బదిలీ కాగా ఆమె స్థానంలో నల్గొండ నుంచి డీఈగా రవి ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులు, కాంట్రాక్టర్లు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News December 27, 2025
విద్యుత్ కష్టాలకు చెక్.. అయినవిల్లిలో భారీ సబ్‌స్టేషన్!

జిల్లాలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి అయినవిల్లిలో నిర్మిస్తున్న 400 కేవీ సబ్‌స్టేషన్ మైలురాయిగా నిలుస్తుందని కలెక్టర్ మహేశ్ కుమార్ పేర్కొన్నారు. అమలాపురంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. లో-వోల్టేజ్ సమస్యలను అధిగమించి, నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టును జిల్లాకే తలమానికంగా చేపడుతున్నట్లు తెలిపారు.
News December 27, 2025
మెదక్‌పై సంగారెడ్డి విజయం

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కాకా వెంకట స్వామి ఇంటర్ డిస్ట్రిక్ట్ 20 ఫైనల్ మ్యాచ్‌లో సంగారెడ్డి జట్టు ఘనవిజయం సాధించింది. SRDలోని గగన్ మైదానంలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సంగారెడ్డి 20 ఓవర్లలో 138 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మెదక్ జట్టు 20 ఓవర్లలో 128 పరుగులు చేసి 10 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. సంగారెడ్డి టీంను క్రీడాభిమానులు అభినందించారు.
News December 27, 2025
MBNR: గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం: ఎస్పీ

CIR పోర్టల్ ద్వారా 1173 మొబైల్ ఫోన్లు బాధితులకు అప్పగించినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. ఆస్తి నేరాల రికవరీ 29.85% నుంచి 46.89%కు పెరిగింది. 2025లో 327 ఆస్తి నేర కేసులు నమోదు కాగా..215 మందిని అరెస్టు చేసి రూ.99,83,318 విలువైన ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాపై 32 మందిని అరెస్టు చేసి 11.850 కిలోల గంజాయి, 22 కిలోల ఆల్పరాజోలం (విలువ రూ.15,23,125) స్వాధీనం చేసుకున్నారు.


