News March 12, 2025

ధన్వాడ: వరి పంటను పరిశీలించిన కలెక్టర్

image

ధన్వాడ మండలం మందిపల్లి గ్రామానికి చెందిన నర్సింహులు అనే రైతు సాగు చేసిన వరి పంటను మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. ఆ రైతు తన నాలుగు ఎకరాలలో వరి పంట వేయగా ఎకరా వరకు సాగు నీరు లేక ఎండిపోయే దశకు చేరుకుంది. గతేడాది వరి సాగుకు ఎలాంటి సమస్య రాలేదని, ఈ వేసవి కాలం భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు వట్టి పోతున్నాయని, వరి పంట ఎండిపోతుందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

Similar News

News March 15, 2026

అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేయవద్దు- కలెక్టర్

image

గ్యాస్ సరఫరాపై వినియోగదారులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. తప్పుడు వార్తలను నమ్మి ఒకేసారి ఎక్కువ బుకింగ్‌లు చేయవద్దని, అవసరమైనప్పుడే సిలిండర్లు తీసుకోవాలని కోరారు. వాట్సాప్, మిస్డ్ కాల్ లేదా ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్‌ల ద్వారా ఇంటి నుండే సులభంగా గ్యాస్ బుక్ చేసుకోవచ్చని సూచించారు. సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని, ఆయిల్ కంపెనీలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని ఆమె భరోసా ఇచ్చారు.

News March 15, 2026

ATP: ఈనెల 16న అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

image

అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఈనెల 16న జిల్లా వ్యాప్తంగా వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రధాన కార్యక్రమం జరగనుంది. నియోజకవర్గ విజన్ యూనిట్లలో విజయవాడలో నిర్వహించే 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఉదయం 11 గంటలకు ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

News March 15, 2026

ఫింగర్ ప్రింట్‌లాగే టంగ్ ప్రింట్స్.. తెలుసా?

image

ప్రతి మనిషికి వేలిముద్రలు ఎలాగైతే వేర్వేరుగా ఉంటాయో నాలుక ముద్రలు (Tongue prints) కూడా అలాగే ఒకరితో ఒకరికి అస్సలు పోలి ఉండవు. ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తుల నాలుక ఆకృతి, ఉపరితల నిర్మాణం ఒకేలా ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కవలల విషయంలోనూ ఇవి భిన్నంగానే ఉంటాయి. ఫ్యూచర్‌లో ఇది అత్యంత నమ్మదగిన బయోమెట్రిక్ గుర్తింపుగా మారే అవకాశం ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో