News March 12, 2025

కడప జిల్లాను పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తాం: కలెక్టర్

image

కడప జిల్లా సంస్కృతి సంప్రదాయాలకు నిలయమని, వాటి విలువలు అందరికీ తెలిపే విధంగా ప్రసిద్ధ ప్రదేశాలు, ఆలయాలను కలుపుతూ పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తామని కలెక్టర్‌ శ్రీధర్ చెరుకూరి అన్నారు. మంగళవారం ఇంటాక్‌ సభ్యులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న పురాతన కట్టడాలు, ప్రసిద్ధ ఆలయాలు, బౌద్ధ జైన వారసత్వ ప్రదేశాలు, కళలు, సంప్రదాయాలు తెలియజెప్పేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

Similar News

News March 5, 2026

పర్యాటక ప్రాంతాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: కడప కలెక్టర్

image

కడప జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు తేవాలని కలెక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారులను బుధవారం ఆదేశించారు. ఆయన బుధవారం తన కార్యాలయంలో టూరిజం కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో చారిత్రక, పర్యటక, దర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయని.. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు పర్యాటక రంగం ప్రధాన భూమిక పోషించే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో JC, టూరిజం అధికారులు పాల్గొన్నారు.

News March 4, 2026

కడప: ప్రత్యేక విభాగాల అధికారులతో జిల్లా ఎస్పీ సమీక్ష

image

ప్రత్యేక పోలీస్ విభాగాల అధికారులతో ఎస్పీ విశ్వనాథ్ బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఫ్యాక్షన్ జోన్, DCRB, DTRB, SBI, SCST సెల్, సైబర్ క్రైమ్, ట్రాఫిక్, కోర్ట్ మానిటరింగ్ సెల్ తదితర విభాగాల అధికారులతో సమీక్షించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఫ్యాక్షన్ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. నేర చరిత్ర కలిగిన వారిపై నిఘా ఉంచాలని ఆయన ఆదేశించారు.

News March 4, 2026

కడప: ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో శనగ ప్రొక్యూర్‌మెంట్ కేంద్రాలు.?

image

కడప జిల్లాలో శనగ పంట ప్రొక్యూర్‌మెంట్ బాధ్యత మార్క్ ఫెడ్ తీసుకుంది. జిల్లాలో 21 ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసింది. మార్క్ ఫెడ్ వద్ద ఉద్యోగులు లేక, డీసీఎంఎస్‌ను ఏజెన్సీగా నియమించుకుంది. డీసీఎంఎస్ వద్ద కూడా సిబ్బంది లేక, 21 ప్రొక్యూర్‌మెంట్ కేంద్రాల్లో నలుగురు DCMS ఉద్యోగులను సూపర్వైజర్లుగా పెట్టారు. 21మంది ప్రవేట్ వారిని ఇన్‌ఛార్జ్‌లుగా పెట్టారు. వీరు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.